Mangli: ప్రముఖ ఫోక్ సింగర్ మంగ్లీ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఒకప్పుడు ఆల్బమ్స్ లో పాడిన మంగ్లీ ఇప్పుడు సినిమాలలో కూడా పాడుతూ ఉంది. ఆమె గొంతుకి చాలా మంది అభిమానులు ఉన్నారు. మంగ్లీ తన కెరీర్‌ని మొదట యాంకర్ గా మొదలుపెట్టింది. అప్పుడు మెల్లమెల్లగా తన పాటలని ప్రజలకి వినిపించడం, అవి ప్రేక్షకులు మెచ్చడం జరిగింది. ప్రస్తుతం మంగ్లీ స్టార్ సింగర్‌గా మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. తక్కువ సమయంలో దాదాపు 100 కి పైగా పాటలు పాడిన ఘనత ఆమెకి దక్కింది. మంగ్లీ సింగర్‌గానే కాకుండా నటిగా పలు సినిమాలు కూడా చేసింది. అయితే మంగ్లీ ప్రతి పండుగకి ఓ ప్రైవేట్ సాంగ్ చేస్తూ అలరిస్తుంటుంది.
ఈ క్రమంలోనే తెలంగాణలో జరగనున్న బోనాలు పండుగ కోసం ఓ ప్రైవేట్ సాంగ్ షూట్ ప్లాన్ చేసింది. ఈ సాంగ్ కోసం తానే ఆడి పాడుతుంది. అయితే ఈ షూటింగ్ సమయంలో మంగ్లీ జారీ పడటంతో కాలికి బలమైన గాయం అయిందని తెలుస్తుంది. అయితే కింద పడిన వెంటనే మంగ్లీని ఆసుపత్రికి తరలిచంగా ప్రస్తుతం ఆమెకి చికిత్స అందిస్తున్నట్టు సమాచారం. మంగ్లీ కొద్ది రోజులపాటు బెడ్ రెస్ట్ తీసుకోవాలని వైద్యులు సూచించినట్టు తెలుస్తుంది. మరి ఇంతకు ఆ సాంగ్ షూట్ పూర్తి చేసిందా, లేదంటే మధ్యలోనే ఇలా ప్రమాదానికి గురైందా అనేది తెలియాల్సి ఉంది.
మంగ్లీకి ప్రమాదం అని తెలిసి ఆమె సన్నిహితులు, స్నేహితులు, ఇండస్ట్రీకి చెందిన పలువురు ప్రముఖులు, అభిమానులు ఆమె త్వరగా కోలుకోవాలంటూ ట్వీట్స్ చేస్తున్నారు. ఇక ఇదిలా ఉంటే సింగర్ మంగ్లీ తన కెరీర్‌ని ముందుకు తీసుకువెళ్లడమే కాదు తన చెల్లెల్ని కూడా పుష్ప సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం చేసిన విషయం తెలిసిందే. మంగ్లీ సోదరి ఇంద్రవతి చౌహన్ పుష్ప సినిమాలో ఊ అంటావా మావ ఊఊ అంటావా మావ అనే పాట పడి మంచి పేరు ప్రఖ్యాతలు దక్కించుకుంది. ఈ పాటకి సమంత అదిరిపోయే స్టెప్పులు వేసి అలరించిన విషయం తెలిసిందే. ఇటీవల మంగ్లీ, ఇంద్రావతి సోషల్ మీడియాలో తెగ సందడి చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం.