తెలుగు సినీ తెరకు రెండు కళ్లుగా భావించబడ్డ వాళ్ళు నందమూరి తారకరామారావు గారు మరియు అక్కినేని నాగేశ్వర రావ్ గారు. వాళ్ళిద్దరి వారసత్వాన్ని కొనసాగించడానికి వచ్చిన వారసులు ఉన్నారు. ముఖ్యంగా హరికృష్ణ, బాలకృష్ట ఆ భాద్యత తీసుకున్నారు. ఐతే, అదే నందమూరి కుటుంబం నుంచి మరో హీరో కూడా తెరమీదకి వచ్చారు. కానీ ఆయన రామారావు కుమారుడు కాదు. రామారావ్ గారికి ఒక తమ్ముడు ఉన్నారు. ఆయన పేరు నందమూర్తి త్రివిక్రమ రావ్. ఆయన సినీ నిర్మాతగా, దర్శకుడిగా మాత్రమే కాకుండా, స్క్రీన్ రైటర్ గా కూడా పనిచేశారు. ఆయన కుమారుడు కళ్యాణ చక్రవర్తి కూడా సినిమాల్లో నటించేవారు. కానీ, సినీ పరిశ్రమలో ఆయన ఎక్కువ కాలం ఉండలేదు. వెండితెరకు ఆయనెలా దూరమయ్యారో చూద్దాం.
1990 లలో ఇంటి దొంగ, దొంగ కాపురం, రౌడీ బాబాయ్ వంటి సినిమాల్లో ఆయన ముఖ్యమైన పాత్రలు పోషించారు. లంకేశ్వరుడు సినిమాలో రెవతికి భర్తగా నటించారు. హాండ్సమ్ గా ఉండే కళ్యాణ్ చక్రవర్తి ఒక పెద్ద హీరో అవుతారని అందరూ భావిస్తున్న సంధర్భంలో ఆయన సినిమాలకు దూరమైపోయారు. ఆయన సినిమాల్లో పాత్రలు ఎంచుకున్న ప్రతిసారీ ఆయన తండ్రి.. త్రివిక్రమ్ రావ్ గారి సలహాలు కచ్చితంగా తీసుకునేవాళ్ళట. ఫ్యామిలీ కథలకే మొగ్గు చూపుతుండే కళ్యాణ్ చక్రవర్తి అక్షింతలు, తలంబ్రాలు, ఇంటిదొంగ, మేనమామ రుద్రరూపం వంటి సినిమాల్లో అధ్బుతంగా నటించారు.
అలా ఒక పెద్ద హీరోగా మారిపోతాడు అనుకున్న కళ్యాణ్ చక్రవర్తి స్టోరీలో ఒక అనుకోని సంఘటన జరిగింది. దురదృష్టవశాత్తూ, అతని కొడుకు పృధ్వి ఒక రోడ్డు ప్రమాదంలో చనిపోయాడట. ఆ సంఘటన ఆయన్ని తీవ్ర వేదనకి గురి చేయడం వల్ల ఇక అప్పటినుంచి మళ్ళీ సినిమాల్లో నటించడానికి ఆసక్తి చూపించలేదట.
అప్పట్లో చెన్నైలో ఉన్న తెలుగు పరిశ్రమ మెల్లగా హైదరాబాద్ కి మారుతున్న సంధర్భంలో.. వాళ్ళ నాన్నగారు నందమూరి త్రివిక్రమరావ్ గారు కూడా చనిపోయారట. ఇక ఆయనకి హైదరాబాద్ వచ్చే ఆలోచన లేకపోవడంతో అక్కడే చెన్నైలో వ్యాపారాలు చేస్తూ ఉండటంతో సినిమాలకు పూర్తిగా దూరమైపోయారు. ఒకవేళ ఆయన సినిమాల్లోనే కొనసాగి ఉంటే.. నందమూరి కుటుంబం నుండి ఒక పెద్ద స్టార్ గా సినీ ఇండస్ట్రీలో మిగిలిపోయేవాళ్ళేమో!
Leave a comment