ఈ మధ్య బాహుబలిలో ప్రభాస్ తల్లిగా కనిపించిన రోహిణి ఒకప్పుడు మలయాళంలో పెద్ద నటి అని చాలామందికి తెలిసి ఉండకపోవచ్చు. చైల్డ్ ఆర్టిస్ట్ గానే ఆమె సినీ తెరమీద చాలా సినిమాల్లో కనిపించింది. చాలా చిన్నవయసులోనే వాళ్ళ అమ్మగారు చనిపోయిన తర్వాత వాళ్ళ నాన్న వేరొక పెళ్లి చేసుకుని వీరిని చెన్నైలో పెంచినట్లుగా తెలుస్తోంది. అలా తమిళ్ లోనూ గుర్తింపు తెచ్చుకుంటూ ఉండటంతో మెల్లగా ఆమెకి మలయాళంలోనూ అవకాశాలు రావడం మొదలైంది.
అక్కడ రోహిణి చాలా తక్కువ టైమ్‌లోనే టాప్ హీరోయిన్ అయిపోయారు. వరస అవకాశాలతో ముందుకెళ్తున్న టైమ్ లో ఆమె ప్రేమలో పడ్డారు. ఆమె ప్రేమించిన వ్యక్తి మరెవరో కాదు. ఒకప్పటి క్లాస్ విలన్ రఘువరన్. ఆమె లాగే రఘువరన్ కూడా ఎంతో పేరు తెచ్చుకున్న నటుడు. ఆయన స్టైల్ కి అప్పట్లో దక్షిణ భారతమంతా ఫ్యాన్ అయిపోయింది. అలాగే హిందీలో కూడా రాణించారు. వీళ్ళిద్దరూ 1996 లో పెళ్లి చేసుకున్నారు. వాళ్ళకి ఒక అబ్బాయి కూడా. పేరు రిషివరన్.
వాళ్ళ జీవితం చాలా సాఫీగానే నడుస్తున్నా.. రోహిణి గారు రఘువరన్ ని ఎక్కువకాలం భరించలేకపోయారు. బాగా తాగే అలవాటు ఉండటంతో ఆయనతో ఎన్నో చేదు అనుభవాలున్నాయని రోహిణి స్వయంగా తన ఇంటర్వ్యూలలో చెప్పారు. వ్యక్తిగతంగా ఎంతో సక్సెస్ అయిన రోహిణికి ఆయన్ని భరించడానికి కారణాలేం పెద్దగా కనిపించి ఉండకపోవచ్చు. ఆమె ఒక నటి మాత్రమే కాదు. తెలుగు, తమిళ భాషల్లో హీరోయిన్స్ కి డబ్బింగ్ చెప్పగలిగే టాలెంట్ ఉన్న ఆర్టిస్ట్. శివ సినిమాలో అమలకి డబ్బింగ్ ఆమె చెప్పారు. ఇంకా శోభన, ఇంద్రజ వంటి వాళ్ళకి డబ్బింగ్ చెప్పేవాళ్ళు. రచయితగా లిరిక్స్, స్క్రీన్ రైటింగ్ లోనూ ఆమె రాణించారు. ఇంకా మోడల్ గా, యాంకర్ గా చేసిన సందర్భాలు ఉన్నాయి.
రఘువరన్ తో కలిసి ఉన్నంత కాలం తను సంతోషంగా లేనని, తనతో పాటు.. తమకి పుట్టిన బాబు కూడా రఘువరన్ ఆల్కహాల్ వ్యసనానికి బాధితులం అయ్యామని ఆమె చెప్పుకొచ్చారు. ఐతే, తనతో విడిపోయిన మరో నాలుగేళ్ళకి రఘువరన్ చనిపోవడం జరిగింది. ఆయన మరణానికి కారణం కూడా అతిగా ఆల్కహాల్ తీసుకోవడం గమనించాల్సిన విషయం. ఏది ఏమైనా రోహిణి లాంటి అందమైన టాలెంటెడ్ లేడీని పెళ్లి చేసుకుని ఆయన కొంచెం బాధ్యతా నాడుచుకుని ఉండాల్సింది. ఆమెకి సంతోషాన్ని ఇవ్వడం మాత్రమే కాకుండా, స్వయంగా ఆయన మరెన్నో ఏళ్ళు ఆరోగ్యంగా బ్రతికి ఉండేవాళ్లు.
Leave a comment