Sridevi Kamal Haasan: భారతీయ సినీ పరిశ్రమని తన అందచందాలతో ఓ ఊపు ఊపేసిన భామ శ్రీదేవి. 1963 ఆగస్టు 13న తమిళనాడులో జన్మించిన శ్రీదేవి అతిలోక సుందరిగా ఎంతో మంది ప్రజల మనసులలో చెరగని ముద్ర వేసుకుంది. బాలనటిగా కెరీర్ స్టార్ట్ చేసి.. భారతీయ సినీ ఇండస్ట్రీలో తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ సొంతం చేసుకున్న ఈ అందాల తార ఒకప్పుడు సినీ ఇండస్ట్రీని ఏక ఛత్రాధిపత్యంగా ఏలింది. సీనియర్ ఎన్టీఆర్ తో సహా స్టార్ హీరోలందరితోనూ కలిసి నటించిన శ్రీదేవి ఊహించని విధంగా మృత్యువాత పడింది. చిన్న వయస్సులోనే శ్రీదేవి కన్నుమూయడం ప్రతి ఒక్కిరిని కలిచి వేసింది.
శ్రీదేవీ సినీ ప్రయాణంలో ఆమె తల్లి పాత్ర ఎక్కువగా ఉండేది. పెళ్లి విషయంలోను చాలా ప్రపోజల్స్ చూసినట్టు సమాచారం. లోకనాయకుడు కమల్ హాసన్‌తో తన కూతురి పెళ్లి చేయాలని అనుకుందట శ్రీదేవి తల్లి. కాని తాను శ్రీదేవిని తోబుట్టువులా భావించేవాడిని అని అందుకే ఆమెను పెళ్లి చేసుకోలేనని అన్నాడట. ఈ విషయాన్ని కమల్ స్వయంగా చెప్పుకొచ్చాడు. శ్రీదేవికి నివాళులు అర్పించే కార్యక్రమంలో భాగంగా శ్రీదేవి 28 అవతరాలు అని రాసిన నోట్లో ఈ విషయాన్ని రాసుకోచ్చారు. తనకి శ్రీదేవి అంటే ఎంతో గౌరవమని చెప్పిన కమల్, ఆమె చనిపోయే వరకు కూడా నన్ను సార్ అనే పిలిచేదని కమల్ చెప్పుకొచ్చారు.
కమల్ శ్రీదేవి కాంబినేషన్లో పలు సూపర్ హిట్ చిత్రాలు రూపొందిన విషయం తెలిసిందే. ఆకలి రాజ్యం, వసంత కోకిల, ఒకరాధ ఇద్దరు కృష్ణులు సినిమాల్లో వీరి కెమిస్ట్రీ చూసి ప్రతి ఒక్కరు ఎంతో సంతోషం వ్యక్తం చేశారు. రొమాన్స్‌కి అయితే నూటికి నూరు శాతం మార్కులు పడ్డాయి. అయితే శ్రీదేవిని తాను చేసుకొని ఉంటే.. భరించలేరని, రోజూ మీ కూతురు మీ ఇంటికి వచ్చేస్తుంటుందని సరదాగా ఓ సందర్భంలో వ్యాఖ్యానించాడట కమల్. ఇక శ్రీదేవి తల్లి.. కమల్‌నే కాక జేడీ చక్రవర్తి, రాజశేఖర్ వంటి వారిని కూడా పెళ్లి చేసుకోమని అడిగిందట. కాని అవన్నీ దాటుకొని శ్రీదేవి.. బోనీ కపూర్‌ని చేసుకొని ఇద్దరు పిల్లలకు జన్మనిచ్చింది.