కళ్ళు చిదంబరం. ఈయన చాలామంది తెలుగు ప్రేక్షకులకి తెలుసు. ఇప్పటిదాకా ఆయన నటించిన సినిమాల ద్వారా ప్రజల అభిమానాన్ని కూడా అందుకున్నారు. ఆయనకి సహజంగా మెల్లకన్ను ఉండడంతో.. ఆ వైకల్యమే ఆయనకి అవకాశాలు తెచ్చిపెట్టింది. వ్యక్తిగతంగా ఆయనకి నటన మీద కూడా ఆసక్తి ఉండటంతో.. ఇంజినీర్ గా పనిచేస్తూనే నాటకాలు కూడా వేసేవారు. ఐతే, ఆయన సినిమాల్లోకి ఎలా వచ్చారో చూద్దాం.
నాటకాలు వేస్తూ.. ఉద్యోగం చేసి కుటుంబాన్ని పోషిస్తున్న సందర్భంలో చిదంబరంకి అనుకోకుండా వచ్చిన అవకాశమే ‘కళ్ళు’ సినిమా. 1988 సంవత్సరంలో దర్శకుడు ఎం.వి. రఘు కొత్త నటులతో కలిసి ఆ సినిమాని తెరకెక్కించాలని అనుకున్నారు. ఆ టైమ్ లోనే ఆయన తొలిసారి చిదంబరం గారిని చూసి ఆయనకి అవకాశం ఇవ్వడం జరిగింది. ఈ సినిమా కథని గొల్లపూడి మారుతీరావ్ గారు రాసారు. ఈ కథని తెరకెక్కించడానికి రఘు చాలా ఖర్చు పెట్టారని టాక్.
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ కి అధ్యక్షుడిగా పనిచేసిన శివాజీ రాజ్ ఈ మూవీ లో కీలకమైన పాత్ర పోషించారు. ఇలా ‘కళ్ళు’ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకి పరిచయం కావడం, అలాగే స్వయంగా ఆయనలో మెల్లకన్ను ప్రత్యేకంగా ఉండటం ఆయనకు కళ్ళు అనేది ఇంటిపేరుగా మారిపోయింది. ఆయన పూర్తి పేరు కొల్లూరు చిదంబర రావ్. ఇలా వచ్చిన అవకాశంతో తన నటనని ప్రూవ్ చేసుకున్న ఆయనకి ఇంకా చాలా సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. ముఖ్యంగా ఈవీవీ సత్యనారాయణ, ఎస్వీ కృష్ణారెడ్డి సినిమాల్లో ఆయన ఎక్కువగా పనిచేశారు.
వ్యక్తిగతంగా చిదంబరం గారు చాలా మంచివ్యక్తి అని పేరు. ఉద్యోగం ద్వారా వచ్చిన డబ్బులతో కుటుంబాన్ని పోషిస్తూ, సినిమాల ద్వారా వస్తున్న రెమ్యూనరేషన్ ని పేదవాళ్ళకి, అనాధ పిల్లలకి ఖర్చు చేసేవారని చెప్తారు. అలాంటి చిదంబరం గారికి ఒక చేదు అనుభవం కూడా ఉంది. అదే ఒక ఫేమస్ హీరోయిన్ ఈయనతో కలిసి నటించటానికి ఒప్పుకోకపోవటం. ఆ మూవీనే రామ్ గోపాల్ వర్మ డైరెక్ట్ చేసిన ‘గోవిందా గోవిందా’. నాగార్జునకి జంటగా శ్రీదేవి నటించిన ఈ మూవీలో చిదంబరంతో సీన్ కి ఒప్పుకోకపోవటంతో ఆర్జీవీ చిదంబరం గారి గురించి చెప్పి ఆమెని కన్విన్స్ చేసారని టాక్. శ్రీదేవి అలా ఎందుకు ఉండేవారో ఆమెకే తెలియాలి. కళ్ళు చిదంబరం 2015 అక్టోబర్ లో 70 ఏళ్ల వయసులో చనిపోయారు.
Leave a comment