Director Suicide: సినిమా అనేది ఒక రంగుల ప్రపంచం. ఈ రంగుల ప్రపంచంలో కొందరు ప్రముఖులు వేరు వేరు కారణాల వలన ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. వారి ఆత్మహత్యలు సినీ పరిశ్రమతో పాటు అభిమానులని శోక సంద్రంలోకి నెట్టేస్తుంది. తాజాగా బాలీవుడ్ సినీ పరిశ్రమలో ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు తెరకెక్కించిన నితిన్ దేశాయ్ ఆత్మహత్య చేసుకొని కన్నుమూసారు. తెలివైన ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్ అయితన నితిన్ కర్జాత్‌లోని తన స్టూడియోలో జీవితాన్ని ముగించుకున్నారని తెలిసింది. అయితే ఆయన ఆత్మహత్యకు సంబంధించి పూర్తి క్లారిటీ లేదు కాని ఆర్థిక ఇబ్బందులు, అప్పుల కారణంగా ఆత్మహత్యకు పాల్పడి ఉండొచ్చని ప్రాథమిక అంచనా వేస్తున్నారు.
నితిన్ ఇలా ఆత్మహత్య చేసుకొని మరణించడం పట్ల బాలీవుడ్ ప్రముఖులు షాక్‌కి గురవుతున్నారు. ఆయన మృతి పట్ల దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. మంచి టాలెంట్ ఉన్న ఈ మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ ఇలా ఆకస్మాత్తుగా కన్నుమూయడం ప్రతి ఒక్కరిని బాధిస్తుంది.కాగా, నితిన్ దేశాయ్ అసలు పేరు నితిన్ చంద్రకాంత్ దేశాయ్. ఆయన దాపోలిలో జన్మించారు. బాలీవుడ్లో నటుడిగా, దర్శకుడిగా, నిర్మాతగా, ఆర్ట్ డైరెక్టర్‌గా, ప్రొడక్షన్‌డిజైనర్‌గా ఇలా పలు చిత్రాలకి పని చేశారు. మరాఠి, హిందీ చిత్రాలకు ఆయన ప్రధానంగా పని చేశారు.
నితిన్.. ఆర్ట్ డైరెక్టర్‌గా `హమ్ దిల్ దే సనమ్`, `లగాన్`, `దేవదాస్`, `జోధా అక్బర్`, `ప్రేమ్ రతన్ ధ్యాన్ పాయో` వంటి భారీ చిత్రాలకు కూడా పని చేసి అందరి మెప్పు పొందారు. ఇండియన్ పాపులర్ ఆర్ట్ డైరెక్టర్, ప్రొడక్షన్ డిజైనర్‌గా పాపులర్ అయిన నితిన్ దేశాయ్… నిర్మాతగా కూడా మారి చంద్రకాంత్ ప్రొడక్షన్స్ స్థాపించారు. ఆ బ్యానర్ లో ఓల దేశ్ దేవీ అనే భక్తి చిత్రాన్ని నిర్మించారు. బెస్ట్ ఆర్ట్ డైరక్టర్‌గా నాలుగుసార్లు జాతీయ అవార్డులు అందుకున్న ఘనత ఆయనది. 52 ఎకరాల్లో ఎన్డీ స్డూడియోస్ ను ఏర్పాటు చేసిన ఆయన…అందులోనే ఆత్మహత్యకు పాల్పడడం బాధిస్తుంది. ప్రముఖ రియాలిటీ షో బిగ్ బాస్‌కి కూడా ఆయన పని చేశారు.