సినిమా ఫీల్డ్ లో సక్సెస్ ఐతే ఆర్థికంగా ఎక్కడికో తీసుకెళ్లిపోతుంది. అందుకే చాలామంది మూవీస్ లో మంచి అవకాశాలు సంపాదించాలి అనుకుంటారు. లేదా స్వయంగా ఒక సినిమాని డైరెక్ట్ చేయాలి అనుకుంటారు. లేదా ఇంకా ఫిల్మ్ మేకింగ్ లో ఉండే 24 విభాగాలలో ఏదోక విభాగంలో రాణించాలి అనుకుంటారు. బాగా డబ్బులు ఉంటే వాటిని మరింత రెట్టింపు చేసుకోవడానికి నిర్మాతల అవతారం కూడా ఎత్తుతారు.
కానీ, అప్పటికే అలా ఫిల్మ్ ఫీల్డ్ లో ఏదోకటి చేసి మంచి పేరు, డబ్బు సంపాదించినా కూడా స్వతహాగా తమకంటూ ఒక ఆదాయ వనరు ఏర్పర్చుకోవాలి అనుకునే లేడీ బాస్ లు కూడా ఉన్నారు. ఇప్పుడు వాళ్ళ గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఐతే, వాళ్ళంతా తిరిగే భర్తలతో పాటు ఫిల్మ్ ఫీల్డ్ లో చేస్తున్న వాళ్ళే కాదు. ఇంటీరియర్ డిజైనింగ్, ఈవెంట్ మేనేజ్మెంట్, ఫ్యాషన్ డిజైనింగ్, బొటిక్స్ వంటి రకరకాల ఫీల్డ్స్ లో రాణిస్తున్నారు. ముందుగా ఇలా సినిమాల్లో ఉన్న లేడీ బాస్ ల గురించి చూద్దాం.
రాజమౌళి ఒక స్టార్ అనే చెప్పాలి. డైరెక్టర్ గా ఆయన మేధో శక్తి ఏంటో చెప్పడానికి బాహుబలి ఒక్కటి చాలు. సినిమాల ద్వారా ఎంతో పేరు, డబ్బు సంపాదించుకున్న వ్యక్తి.. ఆయన భార్య రమా రాజమౌళి కాస్ట్యూమ్ డిజైనర్ గా పనిచేస్తారు. బాహుబలి ఆమె చేసిన కాస్ట్యూమ్స్ మాత్రమే కాకుండా.. అదే టీం కి క్రియేటివ్ గా హెడ్ గా చేసిన మరో వ్యక్తి అంజన ఎవరో కాదు హీరో నాని భార్య. ఆమె బెంగుళూర్ లో ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుని ఆ అనుభవంతో బాహుబలి లాంటి పెద్ద సినిమాకి పనిచేయగలిగారు.
ఇప్పుడు మెగా ఫ్యామిలీ గురించి చూద్దాం. ముందుగా ఉపాసన గురించి మనందరికీ ఇప్పటికే తెలిసిన విషయమే. అపోలో హాస్పిటల్ కి సంబంధించిన కీలక బాద్యతలని ఆమే చూసుకుంటూ ఉంటారు. ఆమెలానే హీరో అల్లు అర్జున్ భార్య కూడా ఒక బడా వ్యాపారవేత్త కూతురు. ఆమె ఆ కంపెనీ వ్యవహారాలు చూసుకుంటూ.. spectrum అనే ఒక మ్యాగజైన్ కి ఎడిటర్ గా కూడా పనిచేస్తుంది. ఇక అల్లరి నరేష్ భార్య విరూప ఈవెంట్ మేనేజర్ గా చేస్తూ నరేష్ కి పోటీగా సంపాదిస్తోంది. ఇక రాజీవ్ కనకాల భార్య సుమ గారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.
Leave a comment