మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల నేపథ్యంలో మూవీ ఆక్టర్స్ మధ్య మా లో వివాదం జరుగుతున్న విషయం తెలిసిందే. ఐతే, ఇప్పటిదాకా ఈ ఎన్నికలకి సంబంధించి వచ్చిన వార్తల్లో బయటికి వచ్చిన ప్రధాన విషయం ఒకటి.. లోకల్ నాన్ లోకల్ అనే వివాదం. ప్రకాష్ రాజ్ తెలుగు వాడు కాదని, ఆయనకి మా ఎన్నికల్లో పార్టీసీపేట్ చేసే అవకాశం ఇవ్వకూడదని మాట్లాడిన వాళ్ళు ఉన్నారు. ఐతే వాళ్ళందరికీ సమాధానం చెప్పే విధంగా ప్రకాష్ రాజ్ కొన్ని రోజుల క్రితమే మీటింగ్ పెట్టి.. అందరి సందేహాలకీ సమాధానాలు ఇచ్చారు. ఆయనకి బండ్ల గణేష్, నాగబాబు వంటి వాళ్ళ సపోర్ట్ అప్పుడే దొరికింది.
కానీ, ఆ మీటింగ్ జరిగిన తర్వాత కూడా కొంతమంది ఆర్టిస్ట్ లు ప్రకాష్ రాజ్ సొంతగడ్డ తెలుగు కాదన్న కామెంట్లు వినిపించాయి. బహుశా నటీ నటులు వాళ్ళల్లో వాళ్ళు ఎక్కువగా ఈ విషయం గురించి మాట్లాడుకుంటున్న విషయం సుమన్ గారికి తెలిసిందేమో తెలీదు కానీ.. ఆయన మాత్రం ఉన్నాఫలంగా ఈ సంఘటన గురించి ఏమనుకుంటున్నారో.. సోషల్ మీడియాలో చెప్పారు.
అసలు భారతదేశంలో పుట్టిన వాళ్ళంతా లోకల్ అని, మనమంతా మనల్ని మనం భారతీయుల్లా చూసుకోవాలి కానీ.. లోకల్ నాన్ లోకల్ అనే విషయం అవకూడదన్న ధోరణిలో ఆయన మాట్లాడారు. ఒకవేళ వచ్చినా నటుల విషయంలో ఈ లోకల్, నాన్ లోకల్ అనే మాట అస్సలు రాకూడదని ఆయన అన్నారు. ఎందుకంటే నటుడు అనేవాడు కళకు ప్రాతినిధ్యం వహిస్తాడు తప్ప ప్రాంతానికి కాదన్న అభిప్రాయాన్ని చెప్పారు. అలాగే, ఎవరైనా ఎక్కడికైనా వెళ్ళేది.. తమకంటూ ఒక అస్తిత్వం ఏర్పర్చుకోవడానికే అని.. మన తెలుగు వాళ్ళు కూడా వేరే భాషల్లో పనిచేసి అక్కడ మంచి గుర్తింపు తెచ్చుకుంటున్నారని ఆయన చెప్పుకొచ్చారు. ఇలా ఇక్కడ పుట్టలేదన్న కారణంలో అందరూ అవతలి వాళ్ళను చూస్తే వేరే ప్రాంతాల్లో బ్రతికే మనవాళ్ళకి కూడా కష్టాలు వస్తాయని ఆయన అన్నారు. అవకాశాల కోసం అందరూ ఎక్కడో చోటుకి వెళ్తూ ఉంటారు కాబట్టి ఇలా లోకల్ నాన్ లోకల్ అనే వాదనను తీసుకురాకూడదని ఆయన గట్టిగా చెప్పారు.
సుమన్ వ్యాఖ్యలు ప్రకాష్ రాజ్ ని ఉద్దేశించి మాట్లాడినవే. ఐతే, సుమన్ కూడా స్వతహాగా వేరొక రాష్ట్రానికి చెందినవాడే కాబట్టి ఆయన ఈ రకమైన కామెంట్ చేసినట్లు తెలుస్తుంది.
Leave a comment