సందీప్ కిషన్ హీరోగా వర్ష బొల్లమ్మ, కావ్య థాపర్లు హీరోయిన్లుగా నటించిన ‘ఊరు పేరు భైరవకోన’ అనే సినిమాను వీఐ ఆనంద్ తెరకెక్కించాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన టీజర్, ట్రైలర్స్ కు ప్రేక్షకుల నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. శేఖర్ చంద్ర అందించిన మ్యూజిక్ కూడా అదిరిపోయింది. ‘నిజమే నే చెబుతున్నా’ అనే పాట చార్ట్ బస్టర్ అవటమే కాకుండా ఈ మూవీపై అంచనాలు పెరగడానికి కూడా కారణమైంది. ఇక గతంలో సందీప్ కిషన్, వీఐ ఆనంద్ కాంబినేషన్లో టైగర్ అనే సినిమా కూడా వచ్చింది.
అది యావరేజ్ మూవీగా మిగిలిపోయింది. ఇక ఇప్పుడు ఊరు పేరు భైరవకోన సినిమాతో ఈనెల 16న ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. ఈ సినిమా విజయంపై ఈ చిత్ర యూనిట్ చాలా కాన్ఫిడెంట్ గా ఉంది. ఇప్పటికే చిత్ర పరిశ్రమకు చెందిన కొంతమంది పెద్దలకి ఈ సినిమా స్పెషల్స్ షోను వేయటం జరిగింది. ఆ షోను చూసినవారు తమ అభిప్రాయాలను తెలియజేయడం కూడా జరిగింది.వారి దగ్గర నుంచి వచ్చిన టాక్ ప్రకారం.. ఈ సినిమా ఫస్ట్ ఆఫ్ సిల్లీ కామెడీతో కొంత మిస్టరీతో సాగుతుందటట.. మ్యూజిక్ ముఖ్యంగా బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ఎంతో ఎంగేజింగ్ గా ఉంటుందని అంటున్నారు.
ఇక ఇంట్రవెల్ సీక్వెన్స్ దగ్గరకు వచ్చేసరికి హీరోయిన్ దెయ్యం అనే ట్విస్ట్ ఇస్తాడట దర్శకుడు. దీంతో సెకండ్ హాఫ్ పై మరింత ఆసక్తి పెరుగుతుంది. ఇక సెకండ్ హాఫ్ లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ బాగున్నా.. ఇది కొంచెం పీరియాటికల్ గా ఉంటుందని అంటున్నారు. ఇక క్లైమాక్స్ లో కొన్ని థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఉంటాయట.ఇక మూవీలో సందీప్ కిషన్ యాక్టింగ్ బాగున్నప్పటికీ.. హీరోయిన్ వర్ష బొల్లమ్మ నటనకే ఎక్కువ మార్కులు పడతాయని అంటున్నారు. డైరెక్షన్, స్క్రీన్ ప్లే ఓకే అనిపిస్తాయని.. చాలా కాలంగా హిట్ కోసమే ఎదురు చూస్తున్న సందీప్ కిషన్ కి ‘ఊరు పేరు భైరవకోన’ సినిమాతో మంచి విజయం అందుకోవడం కాయమని అంటున్నారు.