మన భారతీయ చిత్ర పరిశ్రమలో పౌరాణిక సినిమాలు చేయాలంటే తెలుగు వారే చేయాలనేది అందరికీ తెలిసిన విషయమే.. మన టాలీవుడ్ నుంచి ఎన్నో పౌరాణిక సినిమాలు వచ్చాయి. ఈ చిత్ర పరిశ్రమలో ఎవరు తీయని సినిమాలు కూడా తెలుగు చిత్ర పరిశ్రమలో చేశారు అంటే అతిశయోక్తి కాదు.. అందులో నటరత్న ఎన్టీఆర్ అంటే పౌరాణిక సినిమాలకు పెట్టింది పేరు.
మాయాబజార్ సినిమాలో ఎన్టీఆర్ కృష్ణుడిగా తొలిసారిగా నటించారు.. ఆ పాత్ర ఈరోజుకి చరిత్రలో సువర్ణ అక్షరాలతో నిలిచిపోయింది. ఆ సినిమా తర్వాత కృష్ణుడు అంటే ఎన్టీఆర్ మాత్రమే ఆ పాత్రను చేయగలరు అనేవారు. అదేవిధంగా రాముడు గా కూడా ఎన్టీఆర్ ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించాడు. అంతేకాకుండా పౌరాణిక ప్రతి నాయకులు పాత్రలైనా రావణాసురుడు, దుర్యోధనుడు, కీచకుడు వంటి ఎన్నో పౌరాణిక పాత్రలు నటించి మెప్పించిన ఎన్టీఆర్.. రాముడుగా- కృష్ణుడుగా ఇప్పటికీ ప్రేక్షకుల హృదయాలలో చేరగని ముద్ర వేసుకున్నాడు.
అలాగే మన తెలుగు చిత్ర పరిశ్రమలో జేమ్స్ బాండ్ అంటే సూపర్ స్టార్ కృష్ణ అని అంటారు. ఆయన ఎక్కువగా అటువంటి సినిమాల్లోనే నటించారు. ఆయన కెరీర్లు తక్కువగా పౌరాణిక సినిమాలో నటించారు అందులో కురుక్షేత్రం కూడా ఒకటి… ఈ సినిమాలో కృష్ణ.. అర్జునుడిగా నటించాడు. అయితే కృష్ణ రాముడిగా ఉన్న ఫోటో ఒకటి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. కృష్ణ రాముడిగా ఏ సినిమాలో చేశారు అసలు రాముడు గా కృష్ణ ఎలా ఉంటారు.. అనేది ఇక్కడ చూద్దాం.
సూపర్ స్టార్ కృష్ణ నటించిన సినిమాల్లో అల్లూరి సీతారామరాజు సినిమా మనం భారతీయ చిత్ర పరిశ్రమలో ఉన్న గొప్ప సినిమాలో ఈ సినిమా కూడా ఒకటి.. ఈ సినిమాలో కృష్ణ అల్లూరి సీతారామరాజు పాత్రలో నటించాడు.. అయితే ఈ సినిమా క్లైమాక్స్ లో కృష్ణని బ్రిటీష్ జనరల్ తుపాకీతో కాల్చమని భారత సైనికులను ఆదేశిస్తాడు… ఆ సమయంలో భారతీయ సైనికులకు ఒక్కో విధంగా కనబడతాడు కృష్ణ
ఆ సన్నివేశంలోనే కృష్ణ ఒక సైనికుడికి రాముడుగా కనపడతాడు. అప్పుడు కృష్ణ రాముడుగా వేసిన ఆ చిన్న స్టిల్ ఇప్పుడు వైరల్ అవుతోంది. కృష్ణ పౌరాణిక సినిమాలు చేసినవి బహు తక్కువ, అందులోనే రాముడు, కృష్ణుడు పాత్రలు అయితే అస్సలు వెయ్యలేదు.