Gargi Movie: వెర్సటైల్ యాక్టర్ సూర్య, మోస్ట్ బ్యూటిఫుల్ అండ్ టాలెంటెడ్ యాక్ట్రెస్ సాయి పల్లవి కలిసి ఓ సినిమా కోసం వర్క్ చేస్తున్నారంటే… ఆ ప్రాజెక్ట్ మీద మామూలు హైప్ ఉండదు. ఏ భాషలోనైనా తన క్యారెక్టర్‌తో పాటు డ్యాన్స్‌లోనూ అదరగొట్టేస్తుంది సాయి పల్లవి. ‘విరాట పర్వం’ లో ఆమె పర్ఫార్మెన్స్కి ఎలాంటి పేరు వచ్చిందో తెలిసిందే.
ఇక సూర్య గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ‘ఆకాశం నీ హద్దురా’, ‘జై భీమ్’ అలాగే ‘విక్రమ్’ లో రోలెక్స్ అనే స్పెషల్ క్యారెక్టర్లో అదరగొట్టేశారు. నటనతో పాటు మంచి కథలను, సినిమాలను ప్రేక్షకులకు అందించాలనే ఉద్దేశంతో భార్య జ్యోతికతో కలిసి 2డి ఎంటర్టైన్మెంట్ బ్యానర్ మీద సినిమాలను నిర్మిస్తూ ప్యాషనేట్ ప్రొడ్యూసర్‌గానూ గుర్తింపు తెచ్చుకున్న సూర్య.. ఇప్పుడు సాయి పల్లవి గార్గి (Gargi) సినిమాతో అసోసియేట్ అవుతున్నారు.
గౌతమ్ రామచంద్రన్ దర్శకత్వంలో, డిఫరెంట్ జానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని తమిళ్, తెలుగు, కన్నడతో పాటు సాయి పల్లవి మాతృభాష మలయాళంలోనూ విడుదల చెయ్యబోతున్నారు. సాయి పల్లవి సినిమాతో తాను, జ్యోతిక భాగస్వామ్యం వహిస్తున్నామంటూ సూర్య ట్వీట్ చేశారు. ఈ కపుల్ ఇద్దరూ ఇటీవల హాలీడే ట్రిప్ ఎంజాయ్ చేస్తున్న పిక్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.
Leave a comment