Surya: తమిళ నటుడు సూర్య గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఎంతో టాలెంట్ ఉన్న సూర్య తన నటనతో కేవలం తమిళ ప్రేక్షకులనే కాక తెలుగు ప్రేక్షకులని సైతం అలరిస్తున్నాడు. సూర్య చేసిన ప్రతి సినిమా తెలుగులోను విడుదల కావడం, వాటికి మంచి రెస్పాన్స్ రావడం మనం చూస్తూనే ఉన్నాం. ఇక సూర్య సతీమణి జ్యోతిక కూఆ మంచి నటీమణి కాగా ఆమె పెళ్లి తర్వాత సినిమాలు కాస్త తగ్గించింది.కాని ఇప్పుడు తిరిగి సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తుంది. అయితే సూర్య తన భార్య, పిల్లలని తీసుకొని ఇటీవల ముంబై చెక్కేసారు. తన తండ్రి, తమ్ముడితో వచ్చిన విభేదాల వలనే తన ఫ్యామిలీని తీసుకొనొ ముంబై వెళ్లాడని జోరుగా ప్రచారం నడిచింది.
తండ్రి, తమ్ముడితో గొడవల వల్లే సూర్య ముంబైకి వెళ్లి అక్కడ సపరేట్ ఇల్లు తీసుకొని ఉంటున్నారా. అనే చర్చ నడిచింది. అయితే దీంతో సూర్య అభిమానులలో కొంత ఆందోళన నెలకొంది. అసలు నిజమేంటో తెలియక సూర్య ఫ్యాన్స్ చాలా అప్సెట్ అయ్యారు. ఈ క్రమంలోనే రీసెంట్గా ముంబయిలో నిర్వహించిన ఓ ఫ్యాన్స్ మీట్‌కు హాజరయిన సూర్య.. తన సినిమాలతోపాటు వ్యక్తిగత విషయాలకు సంబంధించి ఆసక్తికర సమాధానాలూ ఇచ్చారు. ఆయన ముంబయికి మారడం గురించి ఓ ఫ్యాన్ ప్రశ్నించగా, దానికి సూర్య పూర్తి క్లారిటీ ఇచ్చారు.
మీ ఫ్యామిలీతో విడిపోయి ముంబయిలో ఇల్లు తీసుకుని ఉంటున్నారా అని గతంలో సూర్యని ప్రశ్నించగా, దానికి ఆయన ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. కాని తాజాగా ఫ్యాన్ మీట్లో అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానం ఇస్తూ.. తాను తమిళనాడు వదిలిపెట్టి ఎక్కడికి వెళ్లనని పేర్కొన్నారు. నా జన్మస్థలం వదిలి నేను వేరే చోటికి ఎందుకు వెళతాను. నేను నా కుటుంబంతో ముంబై వెళ్లడానికి కారణం నా పిల్లలు. వారి చదువుల కోసమే అక్కడికి వెళ్లానే తప్ప మరో కారణం లేదని ఆయన స్పష్టం చేశారు. తాను ఎప్పటికీ తమిళనాడులోనే ఉంటానని సూర్య తెలియజేయడంతో ఇన్నాళ్లు సూర్య గురించి వచ్చిన రూమర్స్ కి చెక్ పడింది.