Tamannaah: మిల్కీ బ్యూటీ తమన్నా అందం, ఆమె నటన గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. పాలరాతి శిల్పంలా కనిపించే తమన్నా చాలా తక్కువ సమయంలోనే స్టార్ హీరోయిన్గా మారింది. ఒక్క తెలుగులోనే కాక ఇతర భాషలలో కూడా ఈ అమ్మడు సత్తా చాటింది. బాహుబలి సినిమాతో అందరికి మంచి పేరు ప్రఖ్యాతలు వచ్చిన కూడా తమన్నాకి మాత్రం అనుకున్నంత రేంజ్లో పేరు రాలేదు. దీంతో చాలా నిరాశకి గురైంది. అయితే ఇటీవలి కాలంలో తమన్నా సినిమాల, వెబ్ సిరీస్‌లు చేస్తూ రచ్చ చేస్తుంది. రీసెంట్గా లస్ట్ స్టోరీస్ 2 అంటూ వచ్చిన వెబ్ సిరీస్‌తో నానా రచ్చ చేసిది. ఇప్పుడు ఇది నెట్ ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అవుతోంది..
ఈ వెబ్ సిరీస్‌లో తమన్నా కాస్తా బోల్డ్‌గా కనిపించింది. అంతేకాదు కొన్ని రొమాంటిక్ సన్నివేశాల్లో కూడా నటించింది.. తన ప్రియుడు విజయ్ వర్మతో ముద్దు సన్నివేశంలో రెచ్చిపోయింది. ఆమె 18 ఏళ్ల నటనా జీవితంలో తొలిసారిగా తెరపై తమన్నా ‘నో ముద్దు’ నిబంధనను ప్రియుడి కోసం ఉల్లంఘించడంతో విజయ్ వర్మ చాలా సంతోషం వ్యక్తం చేశాడట. ఈ జంట అతి త్వరలో పెళ్లి బంధంతో ఒకటి కానున్నారు. అయితే విజయ్ వర్మకి ముందు తమన్నా ఓ కోలీవుడ్ హీరోతో ప్రేమలో ఉన్నట్టు టాక్. వారిద్దరు పీకల్లోతు ప్రేమలో ఉండగా, పెళ్లి కూడా చేసుకోవాలని అనుకున్నారట.
అయితే వీరి పెళ్లికి తమన్నా ఫ్యామిలీ ఒప్పుకున్నా కూడా ఆ హీరో ఫ్యామిలీ ఒప్పుకోలేదంట. ఆ హీరో ఏకంగా తమ్మన్నాని ఇంటికి తీసుకువెళ్లి బతిమిలాడే ప్రయత్నం చేయగా, ఆమె ముందే ఆ స్టార్ హీరో ఫ్యామిలీ నువ్వు మా కోడలిగా వద్దని చెప్పారట. పొట్టి దుస్తులు వేసుకొని నానా రచ్చ చేసేవారు మా ఇంటి కోడలిగా వద్దని అన్నారట. దీంతో తమన్నా చాలా బాధపడుతూ ఆ ఇంటి నుండి వచ్చేసి ఆ తర్వాత విజయ్ వర్మతో ప్రేమలో పడిందని కోలీవుడ్ కోడై కూసింది. మరి ఇందులో ఎంత నిజం ఉందనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం తమన్నా భోళా శంకర్, జైలర్ చిత్రాలలో నటిస్తుంది.