ప్రస్తుతం ఇప్పుడు తెలంగాణలో.. ఆంధ్రాలో.. సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా రేవంత్ రెడ్డి పేరే మారుమ్రోగిపోతుంది .. నిన్న మొన్నటి వరకు తెలంగాణ- ఆంధ్రాలో కొంతమందికే తెలిసిన రేవంత్ రెడ్డి ఇప్పుడు భారతదేశం మొత్తం పాపులర్ అయ్యాడు.. ఇక దేనికి ముఖ్య కారణం తెలంగాణ ఎన్నికల్లో భారీ మెజారిటీతో కాంగ్రెస్ను అధికారంలోకిి తీసుకురావడమే. అంతేకాకుండా ఈనెల 7వ తేది అనగా రేపు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయబోతున్నాడు.
ఇక దీంతో ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఎన్నో ఇంట్రెస్టింగ్ విషయాలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక రేవంత్ రెడ్డి మొదటి నుంచి ఎంతో ఓపెన్.. నిజాతీపరుడు అంటూ ఆయన అభిమానులు ప్రజలు చెప్పుకొస్తున్నారు. అంతేకాకుండా ఉన్నది ఉన్నట్టు మాట్లాడతారని .. ఎవరిని ఎక్కడ దెబ్బ కొట్టాలో రేవంత్ రెడ్డికి బాగా తెలుసు. కాగా ఇలాంటి మస్ లీడర్ అయిన రేవంత్ రెడ్డికి తెలుగు చిత్ర పరిశ్రమలో ఉన్న స్టార్ హీరోలతో మంచి స్నేహం సంబంధాలు ఉన్నాయి.
అలాంటి రేవంత్ రెడ్డికి ఇష్టమైన హీరో ఎవరు.. అంటే మాత్రం ఖచ్చితంగా అది సూపర్ స్టార్ కృష్ణ అనే చెప్పాలి. గతంలో జరిగిన ఓ ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ తనకు ఇష్టమైన హీరో కృష్ణ గారు అంటూ ఆయన చెప్పుకొచ్చారు. ప్రస్తుత తరం హీరోల సినిమాలు ఆయన పెద్దగా చూడరట. కృష్ణ గారి సినిమాలే ఆయన ఎక్కువగా చూస్తారట. ఇక మహేష్ బాబు కూడా చాలాసార్లు తన తండ్రే తనకు ఇష్టమైన హీరో అని చెప్పిన సంగతి తెలిసిందే. ప్రజెంట్ ఇదే వార్త సోషల్ మీడియలో వైరల్గా మారింది.