Home Special Looks అత్యధిక సినిమాలు చేసిన తెలుగు కథానాయకులు!
Special Looks

అత్యధిక సినిమాలు చేసిన తెలుగు కథానాయకులు!

Telugu Actors Who Appeared In The Most Films

వాళ్ళలా వందలకొద్దీ సినిమాలు చేస్తూ కూడా తమ స్టార్ డం ని ఏ మాత్రం తగ్గిపోకుండా చూసుకున్నారు. ప్రస్తుత స్టార్ లు పెద్దగా calculations లేకుండా సినిమా చేస్తే వాళ్ళ స్టార్ డం ఒక్కసారిగా తగ్గిపోతుందనే చెప్పాలి. ఎందుకంటే.. ఒక్క సినిమా పోతే, మళ్ళీ ఇంకో సినిమా చేసి మార్కెట్లో నిలబడటానికి చాలా కష్టం అయిపోతుంది. మూవీస్ ఫ్లాప్ అయితే వాళ్ళ దగ్గరికి మళ్ళీ నిర్మాతలు, దర్శకులు రారు. కానీ అప్పట్లో అలా ఉండేది కాదు. ప్రేక్షకుడికి ఏం చూపించినా చూసేవాడు. తెలుగు సినిమా అభివృద్ధి చెందుతున్న టైమ్ కాబట్టి.. ఎక్కువ కథలు దర్శకులకు తెరపై చూపించడానికి అవకాశం ఉండేది.

ఇప్పుడు ఆ పరిస్థితులు మారిపోయాయి. ప్రతి కథ ఎప్పుడో ఎక్కడో చేసేసినట్టే ఉంటుంది. అందుకే మూవీ మేకింగ్ ప్రాసెస్ చాలా స్లో గా ఉంటుంది. ఇప్పటి స్టార్ హీరోలు 50 మించి సినిమాలు చేయడం కష్టమనే చెప్పాలి. ఐతే, అప్పట్లో ఇలా ఎక్కువ సినిమాలు చేసిన పెద్ద స్టార్స్ ఎవరో చూద్దాం. వీళ్ళంతా 100 కి పైగా చేసిన వాళ్ళు కావడం విశేషం.

మోహన్ బాబు

కలెక్షన్ కింగ్ గా పేరు తెచ్చుకున్న మోహన్ బాబు ఏకంగా 550 కి పైగా సినిమాల్లో నటించారు. హీరోగా, విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా రకరకాలుగా నటించి ఇన్నేసి సినిమాలు చేయగలిగారు. అంటే మోహన్ బాబు ఇంతవరకూ టచ్ చేయని రోల్ అసలు లేదన్న మాట.

క్రిష్ణ

ఇక ఈ లిస్ట్ లో చెప్పుకోవాల్సిన మరో వ్యక్తి మన మొదటి సూపర్ స్టార్. ఆయనే క్రిష్ణ గారు. ఆయన కూడా 350 సినిమాలు చేసారు. క్రిష్ణ గారు కూడా దాదాపు అన్ని తరహా పాత్రలని పోషించేవారు. విలన్ పాత్రలు చేయకపోవచ్చు కానీ.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కూడా ఆయన ఎన్నో సినిమాలు చేసారు. అప్పట్లో ఎంతో గ్లామరస్ నటుడిగా ఆయనకి పేరుండింది. ఆ పేరు వల్లనే ఆయన సంవత్సరానికి 12 సినిమాలు రిలీజ్ చేసేవారట.

ఎన్టీఆర్

కథానాయకుడిగా ఆయన మొత్తం సినిమాలు 300 పై చిలుకు. వీటిల్లో దాదాపు అన్నీ ఆయన హీరోగా చేసినవే. తెలుగు సినీ చరిత్రలో గొప్ప నటుడిగా మార్కులు ఇస్తే మొదటి స్థానం నందమూరి తారకరామారావ్ గారికే చెందుతుందని చెప్పాలి.

ఏఎన్నార్

ఎక్కువ సినిమాలు చేసిన తెలుగు నటుల్లో చెప్పుకోదగిన వ్యక్తి అక్కినేని నాగేశ్వర రావు గారు. ఆయన మొత్తంగా 256 సినిమాలలో నటించారు. నటుడిగా ఆయన చివరి సినిమా ‘మనం’. తారక రామారావ్ గారి లాగే ఈయన కూడా ఇప్పటిదాకా చేసిన సినిమాలు దాదాపు అన్నీ ప్రధాన పాత్రలో చేసినవే. తెలుగు సినీ చరిత్రకి రెండు కళ్ళు అనుకుంటే నాగేశ్వర రావ్ గారిని ఒక కన్నుగా భావించవచ్చు.

కృష్ణం రాజు

ఆయనకి రెబెల్ స్టార్ గా పేరుంది. హీరోగా ఆయన కూడా చాలా గొప్ప పేరు తెచ్చుకున్న హీరో కృష్ణం రాజు గారు. 190 సినిమాల దాకా చేసిన ఆయన హీరో పాత్రలు మాత్రమే కాకుండా అనేక విలన్ పాత్రలు, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసారు.

చిరంజీవి

ఇక మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఖైదీ నంబర్ 150 సినిమాటో 150 సినిమాల మార్కుని దాటేశారు. ఐతే చిరంజీవి మొదట్లో చిన్న చిన్న పాత్రలు చేస్తూనే హీరోగా అవకాశాలు పొందిన నటుడు. విలన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా కూడా చేసారు చిరంజీవి.

శ్రీకాంత్

హీరోగా మాత్రమే కాకుండా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా నటనలో తనని తాను నిరూపించుకుని స్టార్ గా ఎదిగారు శ్రీకాంత్. శ్రీకాంత్ దాదాపు 130 సినిమాలు చేసారంటే మామూలు విషయం కాదు. ఎన్నో భిన్నమైన పాత్రలు పోషించిన పేరు శ్రీకాంత్ గారికి ఉంది. ఈ మధ్య కేసీఆర్ బయోపిక్ లో కూడా నటించారు శ్రీకాంత్.

శోభన్ బాబు

క్రిష్ణ గారి లాగే అందగాడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న శోభన్ బాబు గారు 120 సినిమాలలో నటించారు. ప్రజలకి ఎప్పటికీ అందమైన శోభన్ బాబు లాగే గుర్తుండిపోవాలని ఆయన వయసు పెరిగి, అందం తరిగే సమయానికి సినిమాల నుంచి రిటైర్మెంట్ తీసుకున్నారు.

నందమూరి బాలకృష్ణ

తారక రామారావ్ నట వారసుడిగా బాలకృష్ణ 100 కి పైనే సినిమాలు చేసారు. కెరీర్ మొదట్లో అనేక క్యారక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు పోషించారు బాలకృష్ణ.

జగపతి బాబు

ప్రస్తుతం విలన్ పాత్రలు, తండ్రి పాత్రలు పోషిస్తున్న జగపతి బాబు గారు 100 కి పైగా చిత్రాల్లో నటించారు. హీరో కాకముందు ఆయన కూడా ఎన్నో క్యారక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసారు.

రాజేంద్రపసాద్

కామెడీ హీరో అంటే టక్కుమని గుర్తొచ్చే కొద్ది మందిలో ప్రముఖులు రాజేంద్రప్రసాద్. 150 కి పైగా సినిమాలలో హీరోగా, విలన్ గా, కమెడియన్ గా, క్యారక్టర్ ఆర్టిస్ట్ గా చేసిన సినిమాలు ఉన్నాయి. అవన్నీ ఆయన్ని టాలీవుడ్ ప్రముఖుల్లో ఒకరిని చేసాయి.

ఐతే, ఇక్కడ లిస్ట్ చేసిన వ్యక్తుల పేర్లన్నీ కూడా హీరోలుగా ఎక్కువ సినిమాలు చేసిన వాళ్ళవే. హీరోలుగా కాకుండా.. అందరు నటులని కన్సిడర్ చేస్తే పాపులర్ కమెడియన్స్ ఐన బ్రహ్మానందం, అలీ వంటి వ్యక్తులు చాలామందే రావచ్చు. ఐతే నిజానికి పెద్ద స్థాయిలో స్టార్ డం ని సంపాదించిన హీరోలలో నాగార్జున, వెంకటేశ్ ఇంకా 100 మూవీస్ క్లబ్ లో చేరకపోవడం గమనార్హం.

Leave a comment

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Related Articles

ప‌ట్టుమ‌ని ప‌ది హిట్లు కూడా లేని రామ్ చ‌ర‌ణ్ గ్లోబ‌ల్ స్టార్ ఎలా అయ్యాడు.. చ‌ర‌ణ్ రిజెక్ట్ చేసిన సినిమాలేవో తెలుసా?

మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ అంటే తెలియ‌ని సినీ ప్రియులు ఉండ‌రు. సామాన్యుడి నుంచి...

హీరో తేజ స‌జ్జ త‌ల్లిదండ్రులు ఎవ‌రు.. సినిమా ఇండ‌స్ట్రీలోకి ఎలా వ‌చ్చాడు.. !?

తేజ స‌జ్జ‌.. ప్ర‌స్తుతం ఈ యువ హీరో పేరు మారుమోగిపోతోంది. 2024లో సంక్రాంతి పండుగ కానుక‌గా...

ఎన్టీఆర్ ను అగ్ర‌హీరోగా మార్చిన అడ‌వి రాముడు అప్ప‌ట్లో ఎంత వ‌సూల్ చేసింది.. అడవి రాముడు పేరిట ఉన్న రికార్డులు ఏంటి?

విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు, తెలుగువారి గుండెల్లో నిలిచిన మహా నేత స్వర్గీయ నందమూరి తారక రామారావు...

సినిమాల్లోకి రాక‌ముందు నాగ శౌర్య ఏం చేసేవాడు.. ఆ హీరోయిన్ల‌తో ఎఫైర్‌ నిజ‌మేనా..!?

టాలీవుడ్ లో ఉన్న మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోల్లో నాగ శౌర్య ఒక‌రు. ఊహలు గుసగుసలాడే సినిమాతో...