Varisu Second Look: ‘ఇళయ దళపతి’ విజయ్ తన ఫ్యాన్స్‌కి సాలిడ్ బర్త్‌డే ట్రీట్ ఇవ్వడంతో అభిమానుల ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. జూన్ 22 విజయ్ పుట్టినరోజు సందర్భంగా.. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో.. దిల్ రాజు నిర్మాణంలో.. దళపతి టాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సినిమాకి తమిళ్లో ‘వారిసు’ (Varisu), తెలుగులో ‘వారసుడు’ అనే టైటిల్స్ కన్ఫమ్ చేస్తూ.. The BOSS Returns అనే ట్యాగ్ లైన్ పెట్టారు.
దళపతికి అడ్వాన్స్ బర్త్‌డే విషెస్ చెప్తూ.. జూన్ 21 సాయంత్రం ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. క్లాస్ లుక్‌లో సరికొత్తగా సూపర్ స్టైలిష్‌గా ఉన్న విజయ్ పోస్టర్ అందర్నీ ఆకట్టుకుంది. జూన్ 22 మధ్యాహ్నం #VarisuSecondLook రిలీజ్ చేశారు. చిన్నపిల్లలతో కలిసి చిరునవ్వులు చిందిస్తున్న విజయ్ లుక్ అలరిస్తోంది. వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల చెయ్యనున్నట్లు ప్రకటించారు.
ప్రస్తుతానికి తమిళ్ టైటిల్‌తోనే పోస్టర్స్ రిలీజ్ చేశారు. రష్మిక కథానాయికగా నటిస్తోంది. విజయ్ నటిస్తున్న 66వ సినిమా ఇది. #VarisuFirstLook #VarisuSecondLook #HBDDearThalapathyVijay హ్యాష్ ట్యాగ్స్ ట్రెండింగ్‌లో ఉన్నాయి. జయసుధ, ప్రకాష్ రాజ్, ప్రభు, శరత్ కుమార్, శ్రీకాంత్, యోగిబాబు, సంగీత, సంయుక్త తదితరులు కీలకపాత్రల్లో నటిస్తున్నారు. ఈ సినిమాకి సంగీతం : థమన్, కెమెరా : కార్తీక్ పళని, ఎడిటింగ్ : ప్రవీణ్ కె.ఎల్.
Leave a comment