Thaman: సోషల్ మీడియా ప్రాముఖ్యత పెరిగినప్పటి నుండి సెలబ్రిటీలకి సంబంధించిన ఏ విషయం అయిన నెట్టింట తెగ వైరల్ అవుతుంది. వారు తప్పు చేసిన కరెక్ట్ చేసిన కూడా నెటిజన్స్ ఆ విషయాన్ని తప్పకుండా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారుస్తున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ థమన్ విషయానికి వస్తే ప్రస్తుతం ఆయన టాలీవుడ్ టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ లో ఒకరిగా ఉన్నారు. అయితే ఆయన మ్యూజిక్‌కి మంచి రెస్పాన్స్ వస్తున్నా కూడా వాటిని వేరే వాటి నుండి కాపీ కొడుతున్నట్టుగా సోషల్ మీడియాలో చెప్పుకొస్తున్నారు. థమన్.. బాలకృష్ణ నటించిన వీరసింహరెడ్డి సినిమాలోని యాక్షన్ సన్నివేశాలకు అలాగే బాలకృష్ణ ఎలివేషన్ సీన్స్ కు సంబంధించి అద్భుతమైన బ్యాక్ గ్రౌండ స్కోర్ ఇచ్చాడు. అది సినిమాకి చాలానే హెల్ప్ అయింది.
అయితే జై బాలయ్య అనే పాట మాత్రం కాపీ సాంగ్ అంటూ సోషల్ మీడియాలో తెగ ట్రోల్ చేశారు. ముఖ్యంగా విజయశాంతి ఒసేయ్ రాములమ్మ సినిమాలోని టైటిల్ సాంగ్ నుంచి కాపీ కొట్టారని విమర్శలు గుప్పించారు. అయితే థమన్ పై కాపీ విమర్శలు కొత్తేమి కాదు. థమన్ సంగీతం అందించే ప్రతీ సినిమాకు కూడా ఏదో ఒక విమర్శ వస్తూనే ఉంటుంది. ఆయన సినిమాకి సంబంధించి ప్రతీసారీ సోషల్ మీడియా వేదికగా కాపీ పాటలంటూ ట్రోలింగ్ చేస్తూనే ఉంటారు. ఈ విషయమై కొన్నిసార్లు థమన్ స్పందిస్తారు, మరి కొన్ని సార్లు లైట్ తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ బ్రో సినిమాకి కూడా థమన్ కాపీ చేశాడని ఆరోపణలు వచ్చాయి.
కట్ చేస్తే ఇప్పుడు థమన్.. సూపర్ స్టార్ మహేష్ బాబు మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ అనే చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. కృష్ణ జయంతి సందర్భంగా మూవీ టీజర్ విడుదల చేశారు. ఇందులో మహేష్ బాబు గతంలో ఎన్నడు లేని విధంగా మాస్ లుక్ లో కనిపించాడు. నోట్లో స్టైల్ గా బీడీ పెట్టుకొని నడవడం,దాంతో పాటు ఆయన చెప్పిన డైలాగ్ కి ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఈ టీజర్ కి థమన్ అందించిన బీజీఎం కూడా అదిరిపోయింది. అయితే ఇది దేవిశ్రీ ప్రసాద్.. ఎన్టీఆర్ నాన్నకు ప్రేమతో సినిమాకు ఇచ్చిన సాంగ్ లోని ట్యూన్ కి కాపీగా ఉందని అంటున్నారు. మరి దీనిపై మనోడు ఏమైన స్పందిస్తాడా అనేది చూడాలి.