కొంతకాలం తర్వాత ఆర్థికంగా సమస్యలు రావడంతో అమ్మ నన్ను సినిమాల్లోకి పంపాలని నిర్ణయించుకుంది. కానీ నాన్నకు ఇష్టం లేదని అన్నారు. అమ్మ.. నువ్వు నటిస్తేనే అందరం కడుపు నిండా తినగలమని లేదంటే విషం తాగి చనిపోతామని అన్నారట. ఆ తర్వాత తండ్రి అమర్ నాథ్ చనిపోవడంతో.. కుటుంబాన్ని ఆదుకోవడానికి సినిమాల్లోకి వచ్చారు. అప్పుడే కె. విశ్వనాథ్ గారి డైరెక్షన్ లో ఓ సినిమా, బాపు గారి డైరెక్షన్ లో ఓ సినిమాలో హీరోయిన్ గా ఛాన్స్ వచ్చింది. కానీ ఈ సినిమాల్లో నటించలేకపోయారట.
ఆ తర్వాత నివురుగప్పిన నిప్పు మూవీలో కమెడియన్ గా యాక్ట్ చేసారు. ఆ తర్వాత జంధ్యాల గారి మూవీ రెండు జడల సీత మూవీతో శ్రీలక్ష్మీకి టర్నింగ్ పాయింట్ దక్కింది. లేడీ కమెడియన్ గా సక్సెస్ అయ్యారు. ఇక ముఖ్యంగా శ్రీలక్ష్మీ కోసమే డైరెక్టర్లు ఓ క్యారెక్టర్ ని క్రియేట్ చేసుకునే రేంజ్ కు ఎదిగారు. ఆ మూవీ నుండి దాదాపు 13 ఏళ్ల పాటు తిరుగులేని లేడి కమెడియన్ గా ఎదిగారు. అయితే తనకు పిల్లలు లేరని.. జీవితంలో ఆ కొరత ఎప్పటికీ ఉంటుందని శ్రీలక్ష్మీ బాధపడ్డారు.