BRO Heroine: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్, మెగా మేనల్లుడు సాయి ధరమ్ తేజ్ ప్రధాన పాత్రలలో రూపొందిన చిత్రం బ్రో. ఈ సినిమాలో కేతిక శర్మ కథనాయికగా నటించి అలరించింది. బ్యూటీకి మంచి మార్కులే పడ్డాయి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘రొమాంటిక్’ సినిమాతో ఈ ఢిల్లీ బ్యూటీని టాలీవుడ్‌కి పరిచయం చేశాడు.ఈ సినిమా సమయంలో కుర్రాళ్లంతా కూడా కేతిక గురించే ముచ్చటించుకున్నారు. రొమాంటిక్ సినిమాతో అందరి దృష్టి ఆకర్షించిన కేతికా సినిమాల కోసం ఫ్యాన్స్ అయితే కళ్లు కాయలు కాచేలా ఎదురు చూస్తున్నారు. కేతిక నటించిన ‘రొమాంటిక్’ ఆశించిన స్థాయిలో ఆడకపోయినా, యూత్ లో ఆమెకి ఫుల్ క్రేజ్ ఏర్పడింది.
కేతిక క్రేజ్‌తో ఈ అమ్మడు ‘లక్ష్య’ .. ‘రంగ రంగ వైభవంగా’ సినిమాల ఆఫర్స్ దక్కించుకుంది. ఈ సినిమాల ఫలితం కూడా కేతికను చాలా నిరాశపరిచాయి .కథాకథనాల పరంగా ఆ సినిమాలు పరాజయం పాలయ్యాయిగానీ, గ్లామర్ పరంగా కేతిక మాత్రం మంచి మార్కులే దక్కించుకుంది. అయితే ఇటీవల వచ్చిన బ్రో సినిమాతో కేతిక తొలి హిట్ తన ఖాతాలో వేసుకుంది. రీసెంట్గా కేతిక తాను బాడీ షేమింగ్ ఎదుర్కొన్నట్టు కొన్ని షాకింగ్ కామెంట్స్ చేసింది. డలింగ్ నుంచి సినిమాల వైపు వచ్చినప్పుడు నా సైజుల గురించి చాలా నీచంగా కామెంట్లు చేశారు. డ్రమ్ములా ఉన్నావ్.. నీకు సినిమాలు అవసరమా అంటూ కొందరు దారుణంగా కామెంట్లు చేశారు.వారి కామెంట్లు నాకుఎంతో బాధగా అనిపించాయి అని కేతిక చెప్పుకొచ్చింది.
సినిమాలలోకి వచ్చాక ఇలాంటి వాటిని భరించాల్సిందే అంటూ లైట్ తీసుకున్నా. సీరియస్‌గా తీసుకుంటే పెద్దగా రాణించలేనని తెలిసి లైట్ తీసుకోవడం మొదలు పెట్టానంటూ ఆసక్తికర కామెంట్స్ చేసింది కేతిక. అయితే కేతిక బ్రో సినిమాలో నటించడంతో ముగ్గురు మెగా హీరోలతో కలిసి నటించినట్టైంది. ఇప్పటికే ‘వైష్ణవ్ తేజ్ తో కలిసి నటించిన కేతిక బ్రో సినిమాలో పవన్ – సాయితేజ్ తో కలిసి నటించింది. ఈ క్రమంలో చాలా తక్కువ సమయంలో ముగ్గురు మెగా హీరోలతో కలిసి ఈ అమ్మడు నటించినటైంది.