అరుంధతి మూవీ తెలుగులో ఎంత పెద్ద సక్సెస్ సాధించిందో మనకు తెలిసిన విషయమే. అనుష్క రేంజ్ ని ఒక నటిగా అమాంతం పెంచేసిన సినిమా. ఆ సినిమా నుండి ఆమెకు ఎన్నో అవకాశాలు దక్కాయి. ఇక సినిమా బాక్సాఫీస్ వద్ద కూడా ఏ మాత్రం డీలా పడలేదు. డైరెక్టర్ గా కోడి రామకృష్ణ కెరీర్ లో అతి పెద్ద హిట్ గా నిలిచిన సినిమా ఇది. ఐతే, ఇంత పెద్ద సక్సెస్ సాధించిన ఈ సినిమా కథని రాసుకున్న శ్యామ్ ప్రసాద్ రెడ్డి ముందుగా అనుకున్న నటులు ఎవరో చూద్దాం.
శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి నాయనమ్మ ఆయనకి చిన్నప్పుడు కథలు చెప్తూ ఉండేదట. అందుకే అరుంధతి కథలోనూ.. ఒక ముసలావిడ పాత్రను కూడా రాసుకున్నారు ఆయన. రచయితగా ఆయనకి కథ మీద మంచి పట్టు ఉంటుంది కాబట్టి కథకి ఇండస్ట్రీలో ఉన్నవాళ్ళు ఎవరు సరిగ్గా సూటవుతారు అనే విషయం దగ్గర కూడా బాగా శ్రద్ధ తీసుకున్నట్లు తెలుస్తోంది. అందుకే ముందుగానే.. తాను రాసుకున్న పాత్రలు పలానా నటీ నటులైతే బాగుంటుందని ఆయన తమిళ్ డైరెక్టర్ సభాపతిని సంప్రదించాడట. సినిమాని తీసిపెట్టే బాద్యతని కూడా ఆయనకే ఇవ్వటం కూడా జరిగింది. తర్వాత ఆయన పనిచేయటం నచ్చక కోడి రామకృష్ణ గారికి అప్పగించారు.
ఐతే, తన నట విశ్వరూపం చూపించిన అనుష్క మొదటగా ఈ పాత్ర కోసం ఎంచుకున్న వ్యక్తి కాదంటే నమ్మడం కాస్త కష్టమే. ముందుగా అరుంధతి పాత్ర పోషించడానికి మమతా మోహన్ దాస్ ఐతే బాగుంటుందని అనుకున్నారట. అప్పటికే యమదొంగ మూవీ చేసిన మమతాకి శ్యామ్ ప్రసాద్ రెడ్డి టీం లో పనిచేస్తే ఆ సినిమా తొందరగా పూర్తవదు అనే మాట వినిపించడంతో ఈ మూవీ ఒప్పుకోలేదట. అలాగే, విలన్ గా కూడా ముందు సోనూ సూద్ ని కాకుండా తమిళ నటుడు పశుపతిని అనుకున్నారట. అరుంధతి సినిమాలో విలన్ పాత్ర పేరు కూడా పశుపతి కావడం విశేషం. అలాగే, మూవీలో పకీర్ గా నటించిన షియాజీ షిండే స్థానంలో కూడా మొదట నానా పాటేకర్ ని అనుకున్నప్పటికీ ఆయనకి డేట్స్ కుదరక సినిమాకి ఒప్పుకోలేదట. అదన్న మాట సంగతి.. సినిమా కాస్టింగ్ అనేది ఇంతలా మారినా కూడా మూవీ ప్రేక్షకులని అలరించడంలో ఏ మాత్రం ఫెయిల్ కాలేదు.
Leave a comment