పెద్ద స్టార్ ల పిల్లలు భవిష్యత్తులో సినిమా హీరోలు కావాలంటే.. వాళ్ళని చిన్నప్పటినుంచే తెరకి అలవాటు చేయడం పరిచయం చేయడం జరుగుతుంది. ఉదాహరణకి చాలా మందే ఉన్నారు. సినిమా కథలో హీరో చిన్నతనాన్ని చూపించాల్సి వస్తే ఆ స్థానంలో రియల్ లైఫ్ లోని తారల పిల్లలని చైల్డ్ ఆర్టిస్ట్ గా చూపించే ప్రయత్నం చేస్తారు. లేదా కథానుగుణంగా హీరో పిల్లల్ని చూపించాల్సి వస్తే.. ఆ స్థానంలోనైనా ఎంచుకుంటారు. భవిష్యత్తులో వాళ్ళకి కెమెరా ప్రెజెన్స్ అలవాటు చేయడం ఇందుకు ప్రధాన కారణం అనుకోవచ్చు.
ఐతే, ఇందులో ఇలా చేయడంలో కొన్ని సందర్భాలలో అనుకున్న దానికి తారుమారు అయిపోయి.. కెమెరా ముందు నటించినా కూడా వాళ్ళు సినిమాలో కనిపించే అవకాశం లేకపోవచ్చు. ఇలాంటి పరిస్తితి ఒకటి మెగాస్టార్ కుమారుడు రామ్ చరణ్ తేజ్ విషయంలో జరిగింది. నిజానికి.. చరణ్ సినిమాకి పరిచయం అయ్యే సమయానికి చిరంజీవి నుండి ఎన్నో మెళకువలు నేర్చుకున్నాడనే చెప్పాలి. అలా చిన్నప్పుడే ప్రత్యేకంగా కనిపించాల్సిన అవసరం లేకుండా.. ఎంతో కష్టపడి.. తండ్రి పేరుని ఏ మాత్రం పోగొట్టకుండా.. టాలీవుడ్ లో ఒక పెద్ద హీరోగా నిలబడ్డాడు. ఇంతకీ రామ్ చరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా కనిపించిన ఆ సంధర్భం ఏంటో చూద్దాం.
మెగాస్టార్ ఎంతో ఫామ్ లో ఉన్న సమయంలో.. దర్శకుడు దాసరి నారాయణ రావ్ గారు కూడా డైరెక్టర్ గా మంచి సక్సెస్ చూస్తూ వస్తున్నారు. అప్పటికే 99 సినిమాలు చేసిన దాసరి తన 100 వ సినిమా దాసరితోనే చేసే ప్రయత్నం చేశారు. ఆ సినిమానే ‘లంకేశ్వరుడు’. చిరంజీవి పెద్ద హిట్స్ లో ఒకటిగా నిలిచిన ఆ మూవీలో రామ్ చరణ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించడం విశేషం. కానీ, తర్వాత కథానుసారం చేసిన ఎడిటింగ్ లో చరణ్ కనిపించిన సన్నివేశాన్ని తొలగించారట. ఇక ఆ తర్వాత అప్పుడే చెర్రీపై ఒత్తిడి ఎందుకు అనుకున్నారేమో మళ్ళీ చిరంజీవి గారు ఏ సినిమాలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా నటింపజేసే ప్రయత్నం చేయలేదు.
Leave a comment