Adipurush OTT: రామాయణ ఇతిహాసం నేపథ్యంలో దర్శకుడు ఓం రౌత్.. ప్రభాస్, కృతి సనన్ ప్రధాన పాత్రలలో ఆదిపురుష్ అనే చిత్రాన్ని తెరకెక్కించాడు. ఈ సినిమా జూన్ 16న భారీ ఎత్తున ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో ఇప్పుడు అందరి దృష్టి ఈ సినిమాపైనే ఉంది. ఈ చిత్రం రిలీజ్ కి ముందే పలు రికార్డులని క్రియేట్ చేస్తుంది. అన్ని భారతీయ భాషల్లో కలిపి రిలీజ్‌కు ఒక రోజు ముందుగానే అడ్వాన్స్ బుకింగ్స్ 100 కోట్లను క్రాస్ చేసి ఆదిపురుష్ సంచలనం సృష్టించింది. ఇక ఈ సినిమాకి సంబంధించి కొందరు రివ్యూలు కూడా ఇచ్చేస్తున్నారు. కొందరు హిట్ అంటుంటే మరి కొందరు ఫట్ అంటున్నారు.
ఆదిపురుష్ సినిమా డిజిటల్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ అమెజాన్ ప్రైమ్ దక్కించుకోగా, ఓటీటీ రిలీజ్‌కి సంబంధించి అనేక వార్తలు హల్చల్ చేస్తున్నాయి. ఈ క్రమంలో మేకర్స్ స్పందించారు. అందరు ఖచ్చితంగా ఆదిపురుష్ ని థియేటర్స్ లోనే ఎక్స్ పీరియన్స్ చెయ్యండి. ఎందుకంటే ఆదిపురుష్ మూవీ ని థియేటర్స్ లో చూస్తేనే కిక్ లభిస్తుంది. ఈ చిత్రం త్వరగా ఓటిటిలోకి వచ్చేస్తుంది అని అనుకోవద్దు. ఆదిపురుష్ ఎనిమిది వారాల తర్వాతే అంటే ఆగష్టు సెకండ్ వీక్ లోకి ఓటిటిలోకి వస్తుంది అంటూ మేకర్స్ తెలియజేశారు.
ఇండిపెండెన్స్ డే కానుకగా ఆగస్ట్ సెకండ్ వీక్‌లో ఈ సినిమాని ఓటీటీలో రిలీజ్ చేసే అవకాశం కలదు. అన్ని భాషలలో కలిపి ఆదిపురుష్ చిత్రాన్ని దాదాపు 250 కోట్లకు డిజిటల్ హక్కులను అమెజాన్ ప్రైమ్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తుంది. ప్రభాస్ కెరీర్లో అత్యధిక ధరకు డిజిటల్ రైట్స్ అమ్ముడుపోయిన చిత్రంగా ఆదిపురుష్ నిలిచింది. మూవీని 6200లకుపైగా స్క్రీన్స్‌లో రిలీజ్ చేయనున్నట్టు సమాచారం. రామాయణ గాథ ఆధారంగా రూపొందుతోన్న ఆదిపురుష్ సినిమా ప్రతి ఒక్కరికి నచ్చుతుందని ప్రతి ఒక్కరు సినిమాని థియేటర్ లోనే వీక్షించాలని కోరుతున్నారు. కృతిసనన్ కథానాయికగా నటించిన ఈ మూవీలో సైఫ్ అలీఖాన్ రావణుడి పాత్రను పోషిస్తుండగా, సన్నీ సింగ్ లక్ష్మణుడి పాత్రలో కనిపించనున్నాడు.