Babloo: టాలీవుడ్లో చాలా మంది కమెడీయన్స తమ నటనతో ఎంతగా అలరించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కొందరికైతే ఒకే ఒక్క సినిమాతో మంచి గుర్తింపు వచ్చిన సందర్భం కూడా ఉంది. అయితే మంచి అవకాశాలు వచ్చిన కూడా కొందరు అనుకోని పరిస్థితుల వలన కెరియర్‌కి బ్రేక్ ఇచ్చిన పరిస్థితులు అనేకం. అయితే చేసిన కొన్ని సినిమాల తోనే ప్రేక్షకుల్లో మంచి ముద్ర వేసుకున్న కమెడియన్ గా గుర్తింపు తెచ్చుకున్నాడు బబ్లు. తేజ దర్శకత్వంలో వచ్చిన చిత్రం సినిమా ద్వారా ఇండస్ట్రీకి పరిచయమైన బబ్లు తొలి సినిమాతో మంచి పేరు తెచ్చుకున్నప్పటికీ దానిని కొనసాగించలేకపోయాడు.
బబ్లు టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన చాలా మంది స్టార్ హీరోల సినిమాల్లో నటించాడు. పవన్ కళ్యాణ్, మహేష్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, అల్లు అర్జున్, రాంచరణ్ ఇలా ప్రతి ఒక్కరి సినిమాలో తనదైన పాత్ర పోషించి మెప్పించాడు. ఈ కమెడీయన్ తన కామెడీ టైమింగ్ తో ప్రేక్షకులు అందరి పొట్ట చెక్కలయ్యేలా నవ్వించగలడు. తక్కువ టైంలోనే స్టార్ హీరోల సినిమాల్లో కనిపించడంతో అందరికీ గుర్తుండిపోయాడు. అయితే రాను రాను బబ్లూకి అవకాశాలు తగ్గాయి. దాంతో సినిమా ఇండస్ట్రీకి పూర్తిగా దూరమైపోయాడు. ఇండస్ట్రీకి దూరమైన వారు అప్పుడప్పుడు సోషల్ మీడియాలో ఏదో రకంగా సందడి చేస్తుంటారు.
అయితే బబ్లూ మాత్రం పెద్దగా సందడి చేసినట్టు ఎక్కడా కనిపించలేదు. అయితే కొద్ది రోజులు కిందట ఓ ఇంటర్వ్యూలో బబ్లు తన పర్సనల్ లైఫ్ కి సంబంధించిన కొన్ని విషయాలు చెప్పుకొచ్చి అందరిని ఆశ్చర్యపరిచారు. బబ్లు కెరియర్ పీక్ రేంజ్ లో కొనసాగుతున్న సమయంలోనే అతనికి ఎంతో ఇష్టమైన తండ్రి కన్నుమూసారట. అప్పటినుంచి బబ్లు జీవితం పూర్తిగా మారిందని, చాలా కాలం వరకు ఏ సినిమాని ఆయన ఒప్పుకోలేదు అని అన్నారు. ఇక ఆ క్రమంలోనే తన కెరియర్ లో గ్యాప్ వచ్చిందని బబ్లు చెప్పుకొచ్చాడు ఆ తర్వాత అవకాశాల కోసం ట్రై చేసిన రాలేదు అని ఆవేదన వ్యక్తం చేశాడు బబ్లూ. అయితే మంచి టాలెంట్ ఉన్న బబ్లూ ఇలా ఇండస్ట్రీకి దూరం కావడం అభిమానులని అయితే చాలా బాధించింది.