మెగా ఫ్యామిలీ అంటే మనకి ముందుగా చిరంజీవి, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, అల్లు అరవింద్, అల్లు అర్జున్ వంటివాళ్ళు గుర్తొస్తారు. కానీ, మెగా ఫ్యామిలీ నుండి అంతగా సక్సెస్ అవనివాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు అని మనం ఆలోచించం. అంటే.. ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నది నాగబాబు గురించి కూడా కాదు. కానీ ఒక సీనియర్ సీరియల్ యాక్టర్ గురించి. చిరంజీవికి ఆయన బాబాయ్ అవుతారని మనలో చాలా మందికి తెలిసి ఉండకపోవచ్చు.
అందుకు మరో కారణం ఆయన కేవలం ఒక సీరియల్ నటుడిగానే మిగిలిపోవడం కూడా కావచ్చు. కానీ, ఒకప్పుడు ఆయన సినిమాల ద్వారా కూడా తనని తాను నిరూపించుకునే ప్రయత్నం చేసారు. ‘ఇంద్ర’ సినిమాలో ఇంద్రన్న అంటూ పిలిచే క్యారక్టర్ ఆయనే. అవేమీ పెద్దగా ఫలించకపోయినా.. సీరియల్స్ ద్వారా ప్రేక్షకులకి దగ్గరయ్యారు. ఆయన పేరే హరి. పూర్తిపేరు హరిబాబు. వరసకి బాబాయ్ అయినప్పటికీ.. చిరంజీవి గారు ఎప్పుడూ హరిని బాబాయ్ అని పిలవలేదు.
ఇందుకు కారణం వాళ్ళిద్దరి మధ్య పెద్దగా వయసు భేదం లేకపోవడం. హరితో పాటు ఎవరిని కలిసినా.. చిరంజీవి గారు అతన్ని మిగతావాళ్ళకి కజిన్ అని చెప్పి పరిచయం చేస్తాడట. సినిమాల్లోకి రాకముందు పార్ట్ టైమ్ లెక్చరర్ గా పనిచేసిన హరి గారు, తర్వాత ఆయనకి నచ్చిన వ్యాపారాల్లో అదృష్టం పరీక్షించుకునే ప్రయత్నం కూడా చేసారు. కానీ, అవేమీ ఫలించకపోవడంతో చిరంజీవిని సంప్రదించడం ద్వారా.. నటనలో కొన్ని మెళకువలు తెలుసుకుని ఇక మెల్లగా అక్కడినుంచి అవకాశాలు సంపాదించుకున్నారు. చివరికి.. కొన్ని సినిమాల్లో చేసిన తర్వాత ఇప్పటికీ ఆయన కొన్ని టీవీ ఛానళ్లలో సీరియల్ విలన్ గా కనిపించడం చూస్తూ ఉంటాం.
Leave a comment