Singer: మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా తన సంగీతంతో ఎంతో మంది శ్రోతల మనసులని గెలుచుకున్నారు. ఆయనకి తెలుగు, తమిళంతో పాటు ఇతర భాషలలోను ఎంతో మంది అభిమానులు ఉన్నారు. వివాదాలకి కాస్త దూరంగా ఉండే ఇళయరాజాపై తాజాగా ఓ సింగర్ సంచలన ఆరోపణలు చేసింది. ఆ సింగర్ మరెవరో కాదు రోజా చిత్రంలోని ‘చిన్ని చిన్ని ఆశ’ సాంగ్ పాడిన మిన్మిని అనే సింగర్. రెహమాన్ సంగీత సారథ్యంలో ఈ పాట పాడిన తర్వాత ఆమెకు ఇళయరాజా దగ్గర పాటలు పాడే అవకాశం రాలేదని చెప్పుకొచ్చింది. సింగర్ మిన్మిని 1991 నుంచి 1994 వరకు సింగింగ్ కెరీర్లో యాక్టివ్‌గా ఉన్న ఈవిడ కెరీర్ అర్ధాంతరంగా ముగిసింది. అందుకు గల కారణం తాజా ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చింది.
ఇళయరాజా కంపోజిషన్‌లో రెగ్యులర్‌గా పాటలు పాడుతున్న సమయంలో నాకు రెహమాన్ మొదటి సినిమాలో ‘చిన్ని చిన్ని ఆశ’ సాంగ్ పాడే అవకాశం వచ్చింది. దీనిపై ఇళయరాజా ఆగ్రహం వ్యక్తం చేసారు. నా దగ్గరే పాడాలని వేరే దగ్గర పాడొద్దని ఆయన హెచ్చరించారని చెప్పుకొచ్చింది. రికార్డింగ్ స్టూడియోలో మైక్ ఆన్‌లో ఉన్నప్పుడు ఇదంతా జరగగా, అప్పుడు నా ఏడుపు వారికి వినిపించింది. సింగర్ మనో తనని ఆ సమయంలో ఓదార్చారని స్పష్టం చేసింది. ఇది జరిగిన తర్వాత ఇళయరాజా తనని పాటలు పాడడానికి పిలవలేదని పేర్కొంది. ఇన్నాళ్లు ఈ విషయం రివీల్ చేయకపోవడానికి కారణం అంత పెద్ద మ్యూజిక్ డైరెక్టర్ గురించి ఎవరు తప్పుగా అనుకోవద్దనే.
కెరీర్ మంచి పీక్స్ లో ఉన్నప్పుడు నా వాయిస్ కోల్పోవడంతో సింగింగ్ మానేయాల్సి వచ్చింది. అయితే అదృష్టవశాత్తు తిరిగిరావడంతో 2015లో కమ్ బ్యాక్ ఇచ్చాను. క్వాలిటీ దెబ్బతింటుందని రికార్డింగ్స్ క్యాన్సిల్ చేసుకునే దాన్ని. అయితే ఏఆర్ రెహమాన్ మాత్రం రికార్డింగ్ అస్సలు క్యాన్సిల్ చేసేవారు కాదని చెప్పింది. భారతీరాజా రూపొందించిన ‘కరుతమ్మ’ చిత్రంలో ఓ సాంగ్‌ని తాను పాడలేదన్న ఈ సింగర్.. ట్యూన్‌కు అనుగుణంగా ఒక్కో పదాన్ని పలికితే రికార్డ్ చేశారని ఆనాటి విషయాలని తెలియజేసింది. ఏది ఏమైన మిన్మిని ఇళయరాజాపై చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు హాట్ టాపిక్‌గా మారాయి.