చిత్ర పరిశ్రమలో రోజుకో హీరోయిన్ పుట్టుకొస్తుంది.. అయితే ఎంతమంది అందాల భామలు ఎంట్రీ ఇచ్చిన తమ అందాలను ఆరబోస్తున్న చిత్ర పరిశ్రమలో కొంతమంది హీరోయిన్లకు మాత్రం ఎప్పటికీ స్టార్లుగా ఉంటున్నారు. ఇప్పుడు ఈ లిస్టులో నెంబర్ వన్ స్థానంలో ఉంది చెన్నై బ్యూటీ త్రిష, ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకటి కాదు రెండు కాదు ఎన్నో సినిమాల్లో నటించి తెలుగు ఇండస్ట్రీలోనే ఎవరికి దక్కని స్థానాన్ని క్రియేట్ చేసుకుంది.
రీసెంట్ గానే పాన్ ఇండియా మూవీ పోనియన్ సెల్వన్ సినిమా ద్వారా సెకండ్ ఇన్నింగ్స్ ని కూడా మొదలుపెట్టింది. 40 సంవత్సరాల వయస్సులోనూ తన హాట్ అందాలతో యువత మతులు పోగుడుతూ ఉక్కిరిబిక్కిరి చేస్తుంది. ఈ క్రమంలోనే 20 సంవత్సరాలుగా ఇండస్ట్రీలో రాజ్యం ఏలేస్తున్న త్రిష దాదాపు రూ.110 కోట్లకు పైగానే ఆస్తులను సంపాదించిందట. మరి ముఖ్యంగా చెన్నై, హైదరాబాద్, బెంగళూరు లాంటి మెట్రోపాలిటన్ సిటీస్ లో భారీ లగ్జరీ హౌస్‌లను కూడా కొనుగోలు చేసిందట. అదేవిధంగా పలు స్థలాలను కూడా ఈమె తీసుకుందట.
అదేవిధంగా బంగారం కూడా భారీ స్థాయిలోనే దాచిపెట్టిందట. అంతేకాకుండా ఆమె గ్యారేజ్‌లో లగ్జరీకారులకు కొదవే లేదట. ఈమె నటించే ఒక్కొక సినిమాకుఐదు నుంచి ఏడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ రాబడుతుంది.. అదేవిధంగా యాడ్ ప్రమోట్ చేస్తే మాత్రం రూ.10 నుంచి రూ.12 కోట్ల మేరా రాబడుతుంది. 40 సంవత్సరాల వచ్చిన సరే ఇండస్ట్రీలో ఇప్పటికీ చెక్కుచెదరని అందంతో దూసుకుపోతున్న త్రిష.. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మకు సంబంధించిన ఈ న్యూస్ వైరల్ గా మారింది.