Arjun Daughter: ఇటీవల సినిమా పరిశ్రమకు చెందిన ప్రముఖుల ఇంట్లో పెళ్లి బాజాలు మోగుతున్నాయి. ఆ పెళ్లికి సంబంధించిన ఫోటోలు నెట్టింట తెగ హల్‌చల్ చేస్తున్నాయి. ఈ మధ్య టాలీవుడ్‌లో శర్వానంద్ ఓ ఇంటివాడయ్యాడు. వరుణ్ తేజ్ నవంబర్‌లో పెళ్లి చేసుకోనున్నట్టు తెలుస్తుంది. ఇక యాక్షన్ కింగ్ అర్జున్ కూతురు ఐశ్వర్య పెళ్లికి కూడా ముహూర్తం ఫిక్స్ అయినట్టు తెలుస్తుంది. కన్నడ పరిశ్రమకు చెందిన అర్జున్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు.ఆయన తెలుగు, తమిళంలో నటించి మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించారు. అర్జున్ కూతురు ఐశ్వర్య అర్జున్ కూడా సినీ పరిశ్రమలో నటిగా తన కెరీర్ ప్రారంభించి సత్తా చాటింది. ఈ అమ్మడు మూడు సినిమాలలో హీరోయిన్‌గా నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.
ఇప్పుడిప్పుడే కెరీర్‌పై దృష్టి సారిస్తున్న ఐశ్వర్య త్వరలో పెళ్లి పీటలెక్కబోతున్నట్టు తెలుస్తుంది. తమిళ కమెడియెన్ అయిన తంబి రామయ్య కొడుకు ఉమాపతితో ఐశ్వర్య పెళ్లి జరగబోతున్నట్టు జోరుగా ప్రచారం జరుగుతోంది. కొంతకాలంగా ఐశ్యర్య, ఉమాపతి ప్రేమలో ఉండగా, వీరిద్దరి పెళ్లికి కుటుంబ సభ్యులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో త్వరలో వీరి పెళ్లి జరగనున్నట్టు సమాచారం. అయితే ఐశ్వర్య పెళ్లి గురించి కన్నడ మీడియా పలు కథనాలు ప్రచురిస్తున్నా కూడా ఇందులో ఎలాంటి క్లారిటీ లేదు. అర్జున్ ఫ్యామిలీ కాని ఉమాపతి ఫ్యామిలీ కాని స్పందిస్తే తప్ప దీనిపై ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
ఇక 2013 సంవత్సరంలో ఐశ్వర్య అర్జున్ తమిళ చిత్రంతో హీరోయిన్ గా కెరీర్ ను ప్రారంభించింది. ప్రస్తుతం ఈ అమ్మడికి కోలీవుడ్ లోనే వరుస అవకాశాలు వస్తున్నాయి. మరో వైపు కన్నడ పరిశ్రమలోను చిన్న చితకా అవకాశాలు అందుకుంటుంది. ఇక ఈ అమ్మడు యంగ్ హీరో విశ్వక్ సేన్ సరసన నటించాల్సి ఉన్నప్పటికీ పలు కారణాల వలన ఆ ప్రాజెక్ట్ క్యాన్సిల్ అయింది. ఇక యాక్షన్ కింగ్ అర్జున్ విషయానికి వస్తే ఆయన 40 ఏళ్ల ప్రస్తానంలో దర్శకుడిగా, నిర్మాతగా, రచయితగా తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయనకు సినిమా మీద ఉన్న ప్యాషన్‌తో తన కూతురు ఐశ్వర్యను కూడా సినిమాల్లోకి తీసుకొచ్చారు.