The star heroine who is struggling with opportunities.. does she believe in Lord Venuswamy..!
Home Film News Venu Swamy: అవ‌కాశాలు లేక ఇబ్బందిప‌డుతున్న స్టార్ హీరోయిన్.. వేణుస్వామినే న‌మ్ముకుందా..!
Film News

Venu Swamy: అవ‌కాశాలు లేక ఇబ్బందిప‌డుతున్న స్టార్ హీరోయిన్.. వేణుస్వామినే న‌మ్ముకుందా..!

Venu Swamy: స‌మంత‌, నాగ చైత‌న్య విడాకుల గురించి ముందుగానే చెప్పి ఒక్క‌సారిగా లైమ్ లైట్‌లోకి వ‌చ్చిన ప్ర‌ముఖ జ్యోతిష్కుడు వేణు స్వామి. ఆయ‌న ఇటీవ‌ల సినిమా, రాజ‌కీయ నాయ‌కుల గురించి అనేక విష‌యాలు తెలియ‌జేస్తూ హాట్ టాపిక్ అవుతున్నాడు.  వేణు స్వామి ప్ర‌ముఖుల జాత‌కాలు చెప్ప‌డ‌మే కాకుండా హీరోయిన్స్ కి ప్ర‌త్యేక పూజ‌లు కూడా చేస్తున్నారు. అప్ప‌ట్లో ర‌ష్మిక .. వేణు స్వామితో పూజ‌లు చేయించుకొని స్టార్ హీరోయిన్‌గా ఎదిగింది. ఇక ఆ త‌ర్వాత నిధి అగ‌ర్వాల్ కూడా వేణు స్వామితో పూజ‌లు చేయించుకోగా, అందుకు సంబంధించిన ఫొటోలు నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేశాయి. ఇక  కొద్ది రోజుల క్రితం డింపుల్ హ‌యాతి ఇంట్లో కూడా  వేణు స్వామి యాగం స‌హా ఏవో పూజ‌లు నిర్వ‌హించారు.

జాతకంలో ఏదైనా దోషం ఉన్నా, ఏవైన వివాదాలు చుట్టు ముట్టిన కూడా వాటి నివార‌ణ‌కి పూజ‌లు చేస్తున్నారు వేణు స్వామి. అయితే ఇప్పుడు టాప్ హీరోయిన్స్ లలో ఒక‌రిగా ఉన్న పూజా హెగ్డే కూడా వేణు స్వామితో పూజ‌లు చేయించుకోవాల‌ని అనుకుంటుంద‌ట‌. గత నాలుగైదు ఏళ్లుగా టాలీవుడ్‌లో ఓ వెలుగు వెలిగిన పూజా హెగ్డే ..  ఈ మధ్య  వ‌రుస‌ ప్లాప్ సినిమాలతో ఐరెన్ లెగ్ అని  అనిపించుకుంటుంది. . ఏడాది కాలంగా పూజా హెగ్డేకి మంచి హిట్ ఒక్క‌టి కూడా రావ‌డం లేదు.. కెరీర్ బిగినింగ్ లోఈ అమ్మడు ఎలాంటి స్ట్రగుల్స్ పడిందో మళ్ళీ ఇప్పుడు  ఆమెని అవే స‌మ‌స్య‌లు వెంటాడుతున్నాయి.

మహేష్ బాబు, త్రివిక్రమ్ గుంటూరు కారం మూవీలో పూజా హెగ్డేని` క‌థానాయిక‌గా ఎంపిక చేయ‌గా, ఇప్పుడు ఆమెకి బ‌దులు మ‌రొకరిని తీసుకున్న‌ట్టు స‌మాచారం.అస‌లే ఆఫర్స్ లేక ఆందోళ‌న‌లో ఉన్న పూజా హెగ్డేకి ఇప్పుడు వ‌చ్చిన ఆఫ‌ర్స్ కూడా వెన‌క్కి వెళ్ల‌డంతో ఈ అమ్మ‌డు మాన‌సిక సంఘ‌ర్ష‌ణ‌కి లోనై ప్ర‌ముఖ జ్యోతిష్కుడు  పూజా హెగ్డేతో పూజాలు చేయించుకోవాల‌ని అనుకుంటుంద‌ట‌. మ‌రి ఇప్పుడు ఈ విష‌యం నెట్టింట తెగ వైర‌ల్ కాగా, దీనిపై పూజా హెగ్డే ఏమైన స్పందిస్తుందా లేదా అనేది చూడాలి.

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...