The Intouchables అనే ఫ్రెంచ్ మూవీ నుంచి అడాప్ట్ చేసుకున్న ఈ మూవీ తెలుగు, తమిళ్ రెండు భాషల్లోనూ మంచి విజయం సాధించింది. పారలైజ్ ఐపోయిన ఒక ధనవంతుడు ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నప్పుడు అతను కలుసుకున్న వ్యక్తిత్వ ఏర్పరచుకున్న అనుబంధం ఎలా ఉంటుంది అనేది ఈ మూవీ కథాంశం. అలాగే, ఆ కలిసిన వ్యక్తి ఇతనితో ఏ మాత్రం సంబంధం లేకపోయినా ఒక పేద వాడయినా వాళ్ళ మధ్య స్నేహం ఎలా కుదిరింది అన్న కోణంలో మనుషుల మధ్య ఉండే కామన్ ఫాక్టర్ ని దర్శకుడు చూపించే ప్రయత్నం చేస్తాడు. ఫ్రెంచ్ సినిమాలో ఇది ఒక క్లాసిక్ గా నిలిచిపోయింది.
అలాంటి ఈ మూవీని మన భారతీయులకి చూపించడంలో వంశీ పైడిపల్లి ఏ మాత్రం ఫెయిల్ అవ్వలేదని చెప్పాలి. మూవీ మన నేటివిటీ కి తగ్గట్టుగా తెరకెక్కించడం జరిగింది. నాగార్జున విక్రమాదిత్యగా కుర్చీకి పరిమితమైన పాత్రలో చక్కగా నటించాడు. అతనితో పాటే తమన్నా, కార్తీలు అధ్బుతంగా నటించిన మూవీ 100 కోట్లు పైగా రాబట్టేందుకు కారణం అయ్యారు. ఒక దొంగగా నటించిన కార్తీ తమిళనాట ప్రేక్షకులని కూడా అలరించేదుకు కారణం అయిన విషయం తెలిసిందే.
ఐతే, ఇప్పుడు ఒక విషయం గురించి మాట్లాడుకోవాలి. కార్తీ స్థానంలో ఆ పాత్రకి నటించడానికి ముందుగా జూనియర్ ఎన్టీఆర్ ని అనుకున్నారట. అతనితో మాట్లాడినపుడు ముందుగా ఓకే చెప్పి, ఆ విషయాన్ని మీడియాకి కూడా తెలియజేశారు. కానీ, తర్వాత ఏం జరిగిందో తెలీదు. తారక్ ఈ మూవీలో నటించడం లేదని ప్రకటించాడు. ఒక్క విషయం మాత్రం గెస్ చేయొచ్చు. టాలీవుడ్ లో స్టార్ హీరో అయిన జూనియర్ ఒక దొంగలా.. అది కూడా సెకండ్ హీరోగా నటించడం కాస్త ఇబ్బందిగా అనిపించి ఉండొచ్చు. ఏది ఏమైనా.. జూనియర్ నాగార్జున ఈ మూవీని చేసి ఉంటే తెలుగు ప్రేక్షకులు మరింత పండగ చేసుకునే వాళ్ళేమో!
Leave a comment