2020 ఆరంభంలోనే ఓటీటీలు మెల్లగా జనాలకి పరిచయం అవడం మొదలైంది. కనీసం రెండేళ్లయినా పడుతుంది అనిపించింది అవి సక్సెస్ చూడటానికి. కానీ, కరోనా పుణ్యమా అని అంతకన్నా తక్కువ టైమ్ లోనే అందరి దృష్టీ ఓటీటీల మీద పడింది. ప్రభుత్వాలు లాక్ డౌన్ విధించడం, అందరి ఇళ్ళకే పరిమితం అవ్వాల్సి రావడం అనే కారణాలు తమకెంతో ఇష్టమైన సినిమాలకి దూరమయ్యే అవకాశం లేకుండా ఓటీటీలు మంచి అవకాశాన్ని ఇచ్చాయి. ఇక అప్పటినుంచి సినీ అభిమానులు అందరూ.. సినిమాలని నేరుగా ఓటీటీలో రిలీజ్ ఐతే చూసేయగలం అన్న పరిస్తితికి వచ్చేశారు.
సినీ నిర్మాతలు కూడా మెల్లగా ఆ పరిధిలోనే ఆలోచించడం మొదలెట్టారు. భారీ బడ్జెట్ లు పెట్టి తీస్తున్న సినిమాలని ఓటీటీలో లాభదాయకంగా అమ్మేసే పనిలో పడుతున్నారు. ఓటీటీలలో సినిమాలని అప్లోడ్ చేసుకునే అవకాశం దొరకడం వలన చాలామంది ఒరిజినల్ కంటెంట్ ని పెట్టే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అలా వాటికి చూస్తుండగానే డిమాండ్ ఒక్కసారిగా పెరిగిపోయింది.
చాలా తరచుగా.. ఎప్పుడూ ఏదో ఒకటి రిలీజ్ ఐపోతూ ప్రేక్షకుల చేత సినిమాని ఓటీటీలో చూడటమే బెస్ట్ అనిపిస్తున్నాయి. అందుకే పెద్ద సినిమాలు కూడా ఓటీటీలని ప్రిఫర్ చేయటంతో థియేటర్ల యజమానులు తలలు పట్టుకుంటున్నారు. ఇలా అందరూ తమ సినిమాలని ఓటీటీ ప్లాట్ఫామ్స్ లోనే రిలీజ్ చేసుకుపోతే ఇక థియేటర్లను మూసుకోవాల్సి వస్తుంది అని వాళ్ళలో గుబులు మొదలైంది. ఈ విషయానికి సంబంధించి ఈ మధ్య డిస్ట్రిబ్యూటర్లు సినీ పెద్ద సురేష్ బాబుతో చర్చలు జరిపిన సంగతి తెలిసిందే.
Leave a comment