కరోనా సెకండ్ వేవ్ కారణంగా ఇప్పటివరకు థియేటర్లపై నిషేధం విధించడం జరిగింది. పబ్లిక్ గా ఎక్కువమంది ఒకేచోట కలిసే చోటు థియేటర్ కావడం.. ఇంతకాలం థియేటర్లన్నీ మూత పడేలా చేసింది. ఐతే, సెకండ్ వేవ్ కారణంగా లాక్ డౌన్ నిబంధనలు ఎత్తివేసినప్పటికీ థియేటర్స్ కి ఇన్ని రోజులూ అనుమతి లేదు. అందుకే సినీ పెద్దలు కొంతమంది రెండు రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరిపినట్టు తెలుస్తోంది.
ఆ ఫలితంగానే అతి త్వరలో మూవీ హాల్స్ అన్నిటినీ తెరవబోతున్నారు. కానీ, అందుకు కొన్ని ఆంక్షలు కూడా పెట్టడం జరిగింది. ముఖ్యంగా.. థియేటర్స్ లో కేవలం 50% ఆక్యుపెన్సీతో మాత్రమే రన్ చేయాలి అనేది ప్రధాన షరతు. అయినా, ఈ నెలలో పెద్ద సినిమాలు ఏవి కూడా రిలీజ్ చేసుకునే ఆలోచనలో లేవు. కేవలం చిన్న సినిమాలు మాత్రమే ఆడనున్నాయి. పరిస్తితులు మరికాస్త కుడుటపడ్డాక మాత్రమే బడా సినిమాలు తెరమీద కనిపించనున్నాయి.
Leave a comment