RRR Sequel: ఇన్నాళ్లు తెలుగు సినిమా పరిశ్రమకి అందని ద్రాక్షగా ఉన్న ఆస్కార్ అవార్డ్ ఆర్ఆర్ఆర్ సినిమాతో దక్కిన విషయం తెలిసిందే. చిత్రంలోని నాటు నాటు పాటకి గాను ఆస్కార్ అవార్డ్ దక్కడంతో తెలుగోడితో పాటు దేశం కూడా మీసం మెలేసింది. రామ్ చరణ్,ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో రాజమౌళి ఈ చిత్రాన్ని అత్యత ప్రతిష్టాత్మకంగా రూపొందించారు. స్వాతంత్ర సమరయోధులు అయిన అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్ పాత్రలను ఆధారంగా చేసుకుని విజువల్ వండర్ గా రాజమౌళి తెరకెక్కించిన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద రూ.1000 కోట్లకు పైగా కలెక్షన్స్ అందుకొని సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ చిత్రంపై దేశవ్యాప్తంగా సినీ ప్రేక్షకులే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రముఖులు సైతం విమర్శలు కురిపించడం మనం చూశాం.
అయితే బాహుబలి మాదిరిగా ఆర్ఆర్ఆర్ సినిమాకి కూడా సీక్వెల్ చేస్తే బాగుంటుందని చాలా మంది తమ అభిప్రాయాలు వ్యక్తం చేశారు. ఇన్నాళ్ల తర్వాత రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ వారికి బదులిచ్చారు. మేము ఆర్ఆర్ఆర్ సీక్వెల్‌ను కూడా తెరకెక్కించే ప్లాన్స్ చేస్తున్నాము. కాకపోతే ఇది రాజమౌళి దర్శకత్వంలో కాకుండా అతని పర్యవేక్షణలో వేరే డైరెక్టర్‌తో రూపొందే అవకాశాలున్నాయని విజయేంద్రప్రసాద్ కామెంట్ చేశారు. ఇప్పుడు ఆయన చేసిన ఈ కామెంట్ అభిమానుల్లో జోష్ నింపుతుంది. మరి సీక్వెల్లో రాంచరణ్, తారక్ లీడ్ రోల్స్ చేస్తారా వేరే హీరోలు ఉంటారా అన్న ప్రశ్నకి విజయేంద్ర ప్రసాద్ స్పందిస్తూ వారిద్దరితోనే సీక్వెల్ ఉంటుందని తెలియజేశారు.
మరోవైపు రాజమౌళి డ్రీమ్ ప్రాజెక్ట్ అయిన మహాభారత్ కూడా మహేశ్ బాబు జంగిల్ అడ్వెంచర్ మూవీ తర్వాత ట్రాక్‌పైకి అవకాశాలు ఉన్నట్టుగా విజయేంద్ర ప్రసాద్ హింట్ ఇచ్చాడు. మొత్తానికి విజయేంద్రప్రసాద్ ఒకేసారి మూడు సినిమాల గురించి ఆసక్తికర అప్డేట్స్ ఇచ్చి సినీ ప్రియుల ఆనందానికి అవధులు లేకుండా చేశాడు. ప్రస్తుతం వారు మహేష్ బాబు 29వ సినిమా కోసం వర్క్ చేస్తున్నారు. ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటుండగా,ఆగస్ట్ 9న పూజా కార్యక్రమాలతో మొదలు కానుందని అంటున్నారు. వచ్చే ఏడాది సమ్మర్ నుండి ఈ చిత్ర షూటింగ్ జరిగే అవకాశం ఉంది.