Celebrities: చాలామంది అందంగా ఉండాలి అనుకుంటారు. ముఖ్యంగా సెలెబ్రిటీలు బరువు విషయంలో సన్నగా నాజూకుగా ఉండాలనుకుంటారు. అందుకే ప్రతిరోజు జిమ్ లో గంటల తరబడి కష్టపడుతూ ఉంటారు. మరికొంతమంది సెలెబ్రిటీలు పదుల కేజీల్లో బరువు తగ్గి తమ అభిమానులతో పాటు ప్రేక్షకుల్ని కూడా సర్ ప్రైజ్ చేశారు. వీరంతా ఎలా ఇంత బరువు తగ్గారనేలా ఆశ్చర్యపరిచారు. బరువు తగ్గాలనే బలమైన కోరిక, మంచి ట్రైనర్లు, ఎక్సర్ సైజ్, స్ట్రిక్ట్ డైట్ ఫాలో కావడంతో వీరంతా బరువు తగ్గించుకున్నారు. మరి వీరిలో భారీ స్థాయిలో బరువు తగ్గిన వారెవరో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అద్నాన్ సమీ. ఈయన బాలీవుడ్ టాప్ సింగర్, మ్యూజిషియన్ కూడా. ఆయన ఒకప్పుడు అత్యంత బరువుతో ఉండేవారు. ఎలాగైనా సరే బరువు తగ్గాలని 16 నెలల పాటు కష్టపడి 160 కేజీల బరువు తగ్గాడు.మంచి వ్యాయామం, తగిన డైట్ వల్ల ఇంత బరువు తగ్గాడు. నెక్ట్స్ గణేష్ ఆచార్య.. బాలీవుడ్ టాప్ కొరియోగ్రాఫర్స్ లో ఆయన కూడా ఒకరు. గణేష్ కూడా దాదాపు 18 నెలల పాటు కఠిన వ్యాయామం చేసి 85 కిలోల వెయిట్ లాస్ అయ్యాడు.మంచి ట్రైనర్ కారణంగా ఈ బరువు తగ్గినట్లు చెప్పాడు గణేష్.
ఇండియాలోనే టాప్ బిజినెస్ మ్యాన్ ముఖేష్ అంబానీ కొడుకు అనంత్ అంబానీ.ఒకప్పుడు 200 కేజీల బరువు ఉండేవాడు. 20 నెలల పాటు శ్రమపడి 108 కిలోల బరువు తగ్గాడు.ఇందుకోసం రోజుకు 21 కిలోమీటర్లు వాకింగ్, 5 గంటలు జిమ్ చేసేవాడు.దీనికి అదనంగా డైట్ మెయింటెన్ చేశాడు. జూనియర్ ఎన్టీఆర్ రాఖీ సినిమా వరకు కూడా చాలా లావుగా ఉండేవారు. తన కెరీర్ లో మరింత సక్సెస్ కోసం బరువు తగ్గారు. అయితే ఈయన లాపరోస్కోపీ చేయించుకున్నారు. ఆ తర్వాత నుండి ప్రతిరోజు జిమ్ లో వ్యాయామాలు చేస్తూ.. చాలా స్ట్రిక్ట్ డైట్ ఫాలో అవుతున్నారు.
తెలుగు సినిమా పరిశ్రమలో టాప్ హీరోయిన్ గా కొనసాగుతున్న అనుష్క.. సైజ్ జీరో సినిమా కోసం భారీగా బరువు పెరిగింది. సుమారు 100 కిలోలకు దగ్గర అయ్యింది. ఆ తర్వాత బాహుబలి మూవీ కోసం భారీగా బరువు తగ్గింది. టాలీవుడ్ లేడీ సూపర్ స్టార్ నయనతార కూడా ఒకప్పుడు బాగా బరువు ఉండేది. కానీ జిమ్ లో కుస్తీలు పట్టి బాగా వెయిట్ లాస్ అయ్యింది. మహా నటి సినిమా ద్వారా అలనాటి మహానటి సావిత్రిని అచ్చు గుద్దినట్లు టాలీవుడ్ తెరమీద కనిపించేలా చేసిన కీర్తి సురేష్ కూడా చాలా బరువు తగ్గింది. సారా అలీఖాన్ కూడా దాదాపు 100 కిలోల వరకు బరువు ఉండేది. యోగాతో పాటు జిమ్ చేయడంతోనే తాను బరువు తగ్గానని చెప్పుకొచ్చింది. ప్రజంట్ సారా అలీఖాన్ 50 కేజీలు ఉన్నారు.