నటసింహం నందమూరి బాలకృష్ణ, నటరత్న ఎన్టీఆర్ నట వారసుడుగా బాల నటుడిగా టాలీవుడ్ లో అడుగుపెట్టి తండ్రికి తగ్గ నటుడుగా టాలీవుడ్ లోనే మకుటం లేని మహారాజు గా ఇండస్ట్రీని ఏలుతున్నాడు. బాలయ్య తన కెరీర్లో బాల నటుడుగా, సహనటుడుగా 10కీ పైగా సినిమాలో నటించినిన బాలకృష్ణ సోలో హీరోగా నటించిన తొలి సినిమా 1984 లో వచ్చిన ‘సహాసమే జీవితం’. ఈ సినిమా దగ్గర నుంచి నందమూరి అభిమానులను అలరించే ఎన్నో సినిమాల్లో బాలకృష్ణ నటించిన ఆయన కెరీర్లు ఆగిపోయిన సినిమాలు కూడా ఉన్నాయి.. అనే విషయం చాలామందికి తెలియదు. ఇంతకీ ఆ సినిమాలు ఏమిటో ఇక్కడ చూద్దాం.
1986లో జంధ్యాల దర్శకత్వంలో ‘నటరత్న’ అనే సినిమా చేయాలని బాలయ్య భావించారు.. బాలకృష్ణ పుట్టిన రోజున ఈ సినిమా టైటిల్ ని కూడా అనౌన్స్ చేశారు. అయితే ఈ సినిమా కన్నా ముందే జంధ్యాలతో ‘రెండు రెళ్ళు ఆరు’ సినిమాని నిర్మించిన జి. సుబ్బారావు ఈ సినిమాకి నిర్మాత పడమటి సంధ్యారాగం సినిమాతో పాటు నటరత్న చిత్రాన్ని కూడా అమెరికాలో షూట్ చేయాలని ప్లాన్ చేశారు జంధ్యాల. అయితే అమెరికా వెళ్లడానికి వేశాలు రావడం ఆలస్యం వల్ల బాలకృష్ణ డేట్స్ అడ్జస్ట్ అవలేదుఅయితే అమెరికా వెళ్లడానికి వీసాలు రావడం ఆలస్యం వల్ల బాలకృష్ణ డేట్స్ అడ్జస్ట్ అవలేదు.
దీంతో సూపర్ స్టార్ కృష్ణ పెద్ద కుమారుడు రమేష్ బాబుతో ఈ సినిమా చేయడానికి ముందుకు వచ్చాడు. బాలకృష్ణతో చేయాలన్న కథలోని కొన్ని మార్పులు చేర్పులు చేసి ‘చిన్నికృష్ణుడు’ అనే టైటిల్ తో ఈ సినిమాని కృష్ణ పెద్ద కొడుకుతో జంధ్యాల తెర్కక్కించాడు. ఆ తర్వాత బాలయ్య క్రాంతికుమార్ దర్శకత్వంలో ఓ భారీ 3d సినిమా చేయాలని ప్లాన్ చేశాడు. కానీ ఆ సినిమా కొన్ని అనుకోని కారణాలవల్ల షూటింగ్ కు వెళ్లకుండానే మధ్యలోనే ఆగిపోయింది. అదే విధంగా బాలకృష్ణతో ‘అశోక చక్రవర్తి’ సినిమాను తెరకెక్కించిన ఎస్.ఎస్.రవిచంద్ర బాలయ్యతో ‘బాలకృష్ణుడు’ అనే సినిమా చేయాలని భావించాడు కానీ ఈ సినిమా కూడా స్టేట్స్ మీదకు వెళ్ళలేదు.
2002లో వి.సముద్ర దర్శకత్వంలో దేశభక్తి , లవ్ యాక్షన్ ఎలిమెంట్స్ ఉన్నకథతో బాలయ్య సినిమా చేయడానికి రెడీ అయ్యాడు. అదేవిధంగా పరుచూరి బ్రదర్స్ మాటలు రాశారు. 2002 మార్చ్ 8న అక్కినేని నాగేశ్వరరావు తొలి క్లాప్ కొట్టిన ఈ సినిమా కొద్దిరోజుల షూటింగ్ జరుపుకొని మధ్యలోనే ఆగిపోయింది. ఇక సీనియర్ ప్రొడ్యూసర్ ఎస్. గోపాల్‌రెడ్డికి బాలకృష్ణకి మధ్య ఉన్న స్నేహం అందరికీ తెలిసిందే. వీరిద్దరి కాంబినేషన్లో కోడి రామకృష్ణ దర్శకత్వంలో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు కూడా వచ్చాయి. ఆ సమయంలోనే బాలకృష్ణతో ఎస్ గోపాల్ రెడ్డి కోడి రామకృష్ణ డైరెక్షన్లో ఓ భారీ జానపద చిత్రాన్ని ప్రారంభించారు.
అదేవిధంగా ఆ సినిమాకి విక్రమసింహభూపతి అనే టైటిల్ని కూడా ఖరారు చేశారు. ఈ సినిమాలో బాలయ్య భైరవద్వీపం సినిమా మాద్రిగానే మహారాజుగా, యోధుడిగా రెండు పాత్రలో బాలయ్య నటించారు. ఈ సినిమాలో బాలయ్యకు జంటగా రోజా, పూజాభాత్రాలను హీరోయిన్‌ల్లుగా కన్ఫర్మ్ అయ్యారు. ఆ విధంగా ఈ మూవీ షూటింగ్ సగానికి పైగా పూర్తయిన తర్వాత బాలకృష్ణ, గోపాల్ రెడ్డి మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ఈ సినిమా అక్కడే ఆగిపోయింది. పౌరాణిక సినిమాలున్నా, పౌరాణిక పాత్రలన్నా బాలకృష్ణకు ఎంతో మక్కువ అని అందరికీ తెలిసిందే. తన తండ్రి ఎన్టీఆర్ నటించిన ‘నర్తనశాల’ను అదే పేరుతో తన దర్శకత్వంలో తియ్యాలని నిర్ణయించుకున్నారు బాలయ్య.
తను అర్జునుడుగా, సౌందర్య ద్రౌపదిగా నటించారు. వారం రోజులపాటు ఈ సినిమా షూటింగ్ కూడా జరిగింది. ఆ తర్వాత బాలకృష్ణకు యాక్సిడెంట్ అవ్వడం, సౌందర్య విమాన ప్రమాదంలో మరణించడంతో ఈ సినిమా ఆగిపోయింది. అంతవరకు తీసిన సన్నివేశాలను ఎడిట్ చేసి 16 ఏళ్ళ తర్వాత దాన్ని ఒక షార్ట్ ఫిలింగా విడుదల చేశారు. నందమూరి బాలకృష్ణ, బి.గోపాల్ కాంబినేషన్‌లో లారీ డ్రైవర్, రౌడీ ఇన్‌స్పెక్టర్, సమరసింహారెడ్డి, నరసింహనాయుడు వంటి బ్లాక్‌బస్టర్స్ మూవీస్ వచ్చాయి. ఆ తర్వాత వీరి కాంబినేషన్‌లోనే వచ్చిన పలనాటి బ్రహ్మనాయుడు డిజాస్టర్ అయింది. ఈ సినిమా తర్వాత మళ్ళీ వీరి కాంబినేషన్‌లో ఏ సినిమా కూడా రాలేదు. 2011లో బాలకృష్ణ పుట్టినరోజున బి.గోపాల్ దర్శకత్వంలో ‘హర హర మహాదేవ’ అనే మూవీ మొదలైంది. ఈ సినిమా కూడా చివరికి రెగ్యులర్ షూటింగ్‌కి వెళ్ళకుండానే ఆగిపోయింది. ఇలా బాలయ్య కెరీల్లో షూటింగ్ దశలోనే అగిపోయిన సినిమాలుగా మిగాలిపోయి.