సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్ గురించి కొత్తగా పరిచయం అవసరం లేదు.. కోలీవుడ్ నుంచి బాలీవుడ్ వరకు భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ తెచ్చుకున్న రజిని ఎన్నో వైవిద్యమైన సినిమాల్లో నటిస్తూ ఇప్పటికే ప్రేక్షకులను అలరిస్తూ ఇండియన్ సినిమాకే సూపర్ స్టార్ గా ఎదిగాడు. ఇక నేడు రజనీకాంత్ 73వ పుట్టినరోజు కావడంతో సోషల్ మీడియాలో రజనీకిి సంబంధించిన ఇంట్రెస్టింగ్ వార్తలు వైరల్ గా మారాయి. వాటిలో రజనీకాంత్ ఆయన కెరీర్ లో ఇతర హీరోలతో పలు మల్టీస్టారర్ సినిమాలు కూడా చేశాడు. ఆ సినిమాలు ఏమిటో ఇక్కడ తెలుసుకుందాం.
1). సీనియర్ ఎన్టీఆర్
సీనియర్ ఎన్టీఆర్ తో కలిసి టైగర్ సినిమాలో స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. ఈ సినిమాలో రజనీకాంత్ సెకండ్ హీరోగా నటించారు.
2). మోహన్ బాబు:
మోహన్ బాబు హీరోగా నటించిన పెదరాయుడు చిత్రం భారీ విజయాన్ని అందుకుంది. ఈ సినిమాకి హైలైట్ గా నిలిచింది. రజినీకాంత్ పాత్ర మోహన్ బాబు తండ్రి పాత్రలో నటించడం జరిగింది.
3) శోభన్ బాబు:
శోభన్ బాబు నటించిన జీవన పోరాటం సినిమాలో ఆయనతో కలిసి నటించారు.
4). సూపర్ స్టార్ కృష్ణ:
సూపర్ స్టార్ కృష్ణ తో కలిసి ఇద్దరు అసాధ్యులే వంటి సినిమాలలో రజనీకాంత్ నటించిన జరిగింది. ఈ చిత్రంలో అన్నదమ్ములుగా రజనీకాంత్ కృష్ణ నటించారు.
5). చిరంజీవి:
మెగాస్టార్ చిరంజీవి నటించిన ఎన్నో చిత్రాలలో కాళీ, బందిపోటు సింహం, మా పిల్లై వంటి సినిమాలలో కలిసి ఇద్దరూ నటించడం జరిగిందట..
6). మోహన్‌లాల్:
రజనీకాంత్ మోహన్‌లాల్ కాంబినేషన్లో వచ్చిన చిత్రం కుచేలన్.. ఈ సినిమా తెలుగులో కథానాయకుడుగా తెరకెక్కించారు. ఇందులో టాలీవుడ్ నటులు నటించారు..
7). సునీల్ శెట్టి:
బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి దర్బార్ సినిమాల రజనీకాంత్ తో కలిసి నటించడం జరిగింది. ఈ సినిమా పెద్దగా సక్సెస్ కాలేక పోయింది.
8). మమ్ముట్టి:
రజనీకాంత్ మమ్ముట్టి కాంబినేషన్లో వచ్చిన చిత్రం దళపతి.. ఈ సినిమా రజినీకాంత్ కు బాగా పాపులారిటీ తెచ్చింది.
ఇక వేరే కాకుండా అమితాబచ్చన్, అక్షయ్ కుమార్, షారుక్ ఖాన్, హృతిక్ రోషన్ అమీర్ ఖాన్ అనిల్ కపూర్ సన్నీ డియోల్, జగపతిబాబు, అర్జున్ వంటి హీరోలతో కూడా మల్టీస్టారర్ సినిమాల్లో నటించారు.