Stars: సినీ ఇండస్ట్రీ అంటే కొంతమంది మంచి పేరు సంపాదించుకున్నవారు ఉన్నారు. మరికొంతమంది ఆస్తులు, ఫేమ్ అన్నీ సంపాదించి లైఫ్ లో సెటిల్ అయిన వాళ్లున్నారు. మరికొంతమందికి ఫేమ్, డబ్బు ఉన్నా.. అర్థాంతరంగా.. అయినవాళ్లు లేక.. చాలా దీనస్థితిలో మరణించిన వారు ఉన్నారు. వారిలో మరీ ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మహానటి సావిత్రి. సినిమాల్లో మహానటిగా పాపులర్ అయ్యి
ఎంతో డబ్బు, పలుకుబడి సంపాదించుకుని ఇండస్ట్రీలో తనకంటూ ఓ ఇమేజ్ ను సంపాదించుకుంది. కానీ తనకంటూ ఎవరూ లేకుండా మరణించింది. అలా సొంతవారు దగ్గర లేకుండా అనాధల్లా చనిపోయిన స్టార్స్ ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. సిల్క్ స్మిత.. అప్పట్లో కుర్రాళ్లకు చెమటలు పట్టించిన హీరోయిన్.. ఎన్నో స్పెషల్ సాంగ్స్ లో నటించి పాపులారిటీ తెచ్చుకుంది.
డబ్బు కూడా ఓ రేంజ్ లో సంపాదించుకుంది. ఆఖరికి అయిన వాళ్లకు దూరమై.. అనాధలా చనిపోయింది. నెక్ట్స్ రంగనాథ్.. హీరోగా.. క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, సపోర్టివ్ రోల్స్ లో పేరు తెచ్చుకున్న రంగనాథ్.. కొడుకు, కోడలు ఉన్నా చివరికీ ఒంటరిగానే మృతి చెందారు. రాకేష్ మాస్టర్.. సినీ ఇండస్ట్రీలో డాన్స్ కొరియో గ్రాఫర్ గా గుర్తింపు తెచ్చుకున్న రాకేష్ మాస్టర్ కూడా చివరికీ అనాధలా ఓ ప్రభుత్వ ఆసుపత్రిలో మరణించారు. ఇక నిర్మలమ్మ. సినిమాల్లో అమ్మమ్మ, నానమ్మ, అమ్మ ఈ పాత్రలంటే వెంటనే గుర్తుకొచ్చేది నిర్మలమ్మ. ఎంతోమంది స్టార్ హీరోలకు బామ్మగా నటించి మెప్పించిది.
కోట్ల రూపాయలు సంపాదించుకుంది. కానీ ఒక గదిలో కదల్లేని స్థితిలో ఒంటరిగా మరణించింది. నెక్ట్స్ తెలుగు నాట అన్నగారిలా ఎంతోమంది అభిమానాన్ని సంపాదించుకున్న ఎన్టీఆర్ కు పదిమంది సంతానం ఉన్నా.. తన పిల్లలు లేకుండానే మరణించారు. సినీ ఇండస్ట్రీలో ఐరన్ లెగ్ శాస్త్రిగా పేరు తెచ్చుకుని ఎంతో డబ్బు సంపాదించారు. కానీ ఆయనకు భార్య, పిల్లలు ఉన్నా ఎవ్వరి లేనప్పుడు ఒంటిరిగా చనిపోయారు. లవర్ బాయ్ గా పేరు తెచ్చుకున్న యంగ్ హీరో ఉదయ్ కిరణ్.. ఆయన కూడా ఇండస్ట్రీలో ఎంతోమంది పేరు, డబ్బు సంపాదించుకున్నారు. ఆ తర్వాత అవకాశాలు లేకపోవడం, ఆర్థిక ఇబ్బందులు వెంటాడటంతో ఆత్మహత్య చేసుకుని చనిపోయారు.