Nandamuri Kalyan Ram: నందమూరి ఫ్యామిలీ నుండి థర్డ్ జనరేషన్ హీరోగా ‘తొలిచూపులోనే’ మూవీతో ఎంట్రీ ఇచ్చిన కళ్యాణ్ రామ్.. నటుడిగానే కాకుండా నిర్మాతగానూ అభిరుచిని చాటుకున్నాడు. తాత స్వర్గీయ నందమూరి తారక రామారావు పేరు మీద ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ స్థాపించి, పలువురు దర్శకులను తెలుగు ఇండస్ట్రీకి పరిచయం చేసాడు. అలా కళ్యాణ్ ఇంట్రడ్యూస్ చేసిన డైరెక్టర్స్ ఎవరో ఓసారి చూద్దాం..
హీరోగా మూడవ సినిమా ‘అతనొక్కడే’ కే ప్రొడ్యూసర్‌గా మారిన కళ్యాణ్ రామ్.. ఆ మూవీతో సురేందర్ రెడ్డిని దర్శకుడిగా పరిచయం చేసాడు.
అశ్వినీ దత్ నిర్మించిన ‘అభిమన్యు’ తో దర్శకుడిగా పరిచయం అయిన మల్లికార్జున్‌తో తన బ్యానర్లో ‘కళ్యాణ్ రామ్ కత్తి’, వేరే నిర్మాతతో ‘షేర్’ సినిమాలు చేశారు. ‘అసాధ్యుడు’ తో అనిల్ కృష్ణ (అనిల్ కన్నెగంటి), ‘ఓం 3డి’ తో సునీల్ రెడ్డిని పరిచయం చేశారు. త్రీడీలో చేసిన ఫస్ట్ ఇండియన్ యాక్షన్ ఫిలిం ఇది. నిర్మాతగా కళ్యాణ్ రామ్ చాలా నష్టపోయిన సినిమా ఇది.
‘ఎమ్ఎల్ఏ’ తో ఉపేంద్ర మాధవ్, ‘118’ తో కెమెరామెన్ కె.వి.గుహన్, రీసెంట్ బ్లాక్ బస్టర్ ‘బింబిసార’ తో వశిష్టను దర్శకులుగా పరిచయం చేశారు. ‘బింబిసార 2’ తో మరో బ్లాక్ బస్టర్ కొడితే.. సురేందర్ రెడ్డి, అనిల్ రావిపూడిలానే వశిష్ట కూడా స్టార్ డైరెక్టర్ అయిపోవడం ఖాయం.
Leave a comment