టాలీవుడ్ లో స్టార్ కమెడియన్స్ అంటే గుర్తొచ్చే కొద్దిమందిలో ఒకరు ధర్మవరపు సుబ్రహ్మణ్యం. ఆయనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన పేరు గుర్తురాగానే యధావిధిగా ఆయన వేసే పంచ్ డైలాగ్ లు కూడా గుర్తుకువస్తూ ఉంటాయి. మొదట్లో ఆయన రేడియో రంగంలో పనిచేసేవాళ్ళు. తర్వాత బుల్లితెరలో నటించే అవకాశాన్ని కూడా సంపాదించారు. ఆయనలో చాలా ప్రత్యేకంగా కనిపించే కోణం వెటకారం. ప్రకాశం జిల్లాకి చెందిన ఆయనకి ఈ లక్షణం ఆ ప్రాంతాన్ని బట్టి వచ్చిందని అంటారు.
ఆయనకు సహజంగా వచ్చిందో లేక ప్రాక్టీస్ చేశారో తెలియదు కానీ సరిగ్గా ఆయనలో ఉన్న ఈ స్వభావమే ఆయన్ని సినిమాల వైపు నడిపించింది. కానీ, అలా సినిమాల్లోకి రావడం కూడా ఒక్కసారిగా జరగలేదు. తెలుగు చిత్ర పరిశ్రమ హైదరాబాద్ కి మారే టైమ్ లో ఒకసారి సినీ పెద్దలంతా చిరంజీవి గారింట్లో కలిసినప్పుడు.. ఇంకా రావాల్సిన వాళ్ళంతా రావడానికి టైమ్ పడుతుందని తెలిసినప్పుడు అక్కడ ఉన్న వాళ్ళని ఎంటర్టైన్ చేయడం కోసం చిరంజీవి గారు ఎవరినైనా జోక్స్ చెప్పండని అడిగినప్పుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం గారు లేచి అందరినీ నవ్వించారట.
అది చూసిన అక్కడికి వచ్చిన దర్శకులు, నిర్మాతలు ఆయనకి ఇంప్రెస్ అయి సినిమాలలో అవకాశాలు ఇవ్వడం మొదలెట్టారట. ఇక అప్పటినుంచి ఆయన వెనక్కి తిరిగిచూసుకోలేదు. అనేక సినిమాలలో తనని తాను నిరూపించుకుంటూనే ఉన్నారు. కొన్ని నాటికలు, రేడియో ప్రోగ్రామ్స్ కి స్క్రిప్ట్ లని కూడా రాసేవారు. చివరి దశలో సాక్షి అనే ఒక పొలిటికల్ ఛానల్ కి కూడా పనిచేశారు. సినిమాల్లో ఎక్కువగా లెక్చరర్ల పాత్రలు చేస్తూ.. వాటిని కించపరుస్తున్నారనే విమర్శల వల్ల వాటిని చేయడం ఆపేశారు.
Leave a comment