Tickets: టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో సినిమాలు అంటే ఓ క్రేజ్ ఉంటుంది. ప్రజంట్ ఎంత పెద్ద సినిమా అయినా ఎక్కువగా అంటే ఓ నెల రోజులు ఆడుతున్నాయి. కానీ ఒకప్పుడు సినిమాలు రిలీజ్ అయితే మినిమం 100, 200 రోజులు ఆడేవి. అలా రిలీజ్ అయిన తర్వాత 100 డేస్ ఫంక్షన్ కూడా చేసేవారు. అలా మన తెలుగు సినిమా ఒక ఇండియాలోనే అత్యధిక టికెట్లు అమ్ముడుపోయాయనే విషయం తెలుసా.. ఈ సినిమా ఇండియాలోనే అత్యధిక టికెట్లు అమ్ముడుపోయిన మూవీగా హిస్టరీ క్రియేట్ చేసింది. ఆ సినిమా ఎవరిదంటే విక్టరీ వెంకటేష్ ది. ఆయనకు అప్పట్లోనే ఫ్యామిలీ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ఫాలోయింగ్ ఉండేది.
ఆయన సినిమా వస్తుందంటే చాలా ఫ్యామిలీ ఆడియన్స్ లో కూడా ఓ మంచి ఇంట్రెస్ట్ ఉండేది. ఆ మూవీ కలిసుందాం రా. ఈ సినిమాను ఉదయ్ శంకర్ డైరెక్ట్ చేశారు. ఈ మూవీలో కీలక పాత్రలో కె. విశ్వనాథ్ గారు నటించారు. సిమ్రాన్ హీరోయిన్ గా నటించారు. కలిసుందాం రా మూవీ ఫుల్ ఫ్యామిలీ ఓరియెంటెడ్ ప్రాజెక్ట్ గా రిలీజ్ అయ్యింది. ఈ సినిమా దాదాపు 78 కేంద్రాల్లో రిలీజ్ అయ్యింది. కేవలం 4 కోట్ల రూపాయల బడ్జెట్ తో అన్ని కేంద్రాల్లో కూడా నాన్ స్టాప్ గా 100 రోజులు ఆడింది.
అప్పుట్లు ఈ విధంగా ఆడిన సినిమాగా సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. 14 సెంటర్లలో 175 రోజులు, 4 సెంటర్లలో 200 రోజులు ఆడింది. అప్పట్లో రెండు కోట్ల 50 టికెట్లు అమ్ముడయ్యాయి. ఈ ఫిగర్ అప్పట్లో ఆల్ ఓవర్ ఇండియాలోనే సెన్సేషన్ ను క్రియేట్ చేసింది. ఈరోజు వచ్చే సరికి కూడా ఈ సినిమాను ఇంకే సినిమా కూడా బీట్ చేయలేదంటే అది నార్మల విషయం కాదు. ఈ అరుదైన రికార్డ్ ను క్రియేట్ చేసిన ఘనతగా వెంకటేష్ పేరు మీదే ఉండటం హైలెట్ గా నిలిచింది.