Renu Desai: రాజకీయాలలోకి వచ్చాక పవన్ కళ్యాణ్ వ్యక్తిగత జీవితాన్ని వైసీపీ తెరపైకి తీసుకొస్తుండడం మెగా అభిమానులని చాలా ఇబ్బంది పెట్టింది.జగన్‌తో పాటు వైసీపీ మంత్రులు, నాయకులు కూడా పవన్ మూడు పెళ్లిళ్ల విషయాన్ని పదేపదే ప్రస్తావిస్తూ ఆయనని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలో పవన్ పెళ్లిళ్లపై ఓ వెబ్ సిరీస్ తీస్తామంటూ కూడా అంబటి రాంబాబు స్టేట్మెంట్ ఇచ్చారు. దీంతో పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణూ దేశాయ్ సీన్లోకి ఎంట్రీ ఇచ్చింది. తన సోషల్ మీడియాలో ఒక వీడియోని విడుదల చేస్తూ.. “డబ్బుపై పవన్‌కు ఏ మాత్రం ఆశలేదు. సమాజానికి ఎంతో కొంత మంచి చేయాలనే తపనతో ఆయన రాజకీయాల్లోకి వచ్చాడు. రాజకీయంగా ఆయనకి నా మద్దతు తప్పకుండా ఉంటుంది.
అయితే నా విషయంలో మాత్రం ఆయన వందశాతం తప్పు చేశారు. పవన్‌తో రాజకీయ, వృత్తిపరమైన విభేదాలుంటే మీరు మీరు చూసుకోవాలి కాని వాటిలోకి మహిళల్ని, పిల్లల్ని లాగొద్దు అంటూ ఆమె సున్నితంగా హెచ్చరించారు. అయితే ఆమె స్టేట్మెంట్స్లో పవన్‌కు సానుకూలంగా మాట్లాడిన దానికంటే, తన విషయంలో తప్పు చేశారనే అభిప్రాయం ఎక్కువగా వినిపించింది. రేణూ దేశాయ్.. పవన్‌కి మద్దతుగా మాట్లాడినట్టు కనిపించినా, ఇరికించారనే కోపం జనసేన నుంచి వస్తుంది.అయితే అసలు పవన్ గురించి మాట్లాడడానికి ఎప్పుడు ఆసక్తి చూపని రేణూ.. ఈ సారి కనీసం తనకి రాజకీయంగా మద్దతు ఇస్తానని చెప్పడం కూడా గొప్ప విశేషం అంటున్నారు.
అయితే గతంలో ఎప్పుడు ఇలా మాట్లాడని రేణూ దేశాయ్ ఇప్పుడు అలా మాట్లాడడానికి అసలు కారణం ఏంటి..ఈమెలో ఇంత మార్పు రావడం వెనక ఎలాంటి కారణం ఉందని అందరూ కామెంట్లు పెడుతున్నారు. అయితే రేణూ దేశాయ్‌లో ఇంత మార్పు రావడం వెనక మెగా ఫ్యామిలీ ఉన్నట్టు తెలుస్తుంది. భవిష్యత్‌లో తన కొడుకు,కూతురికి తండ్రి సపోర్ట్ తప్పక కావాలి అనే ఉద్దేశంతో కూడా రేణుదేశాయ్ ఇలాంటి వ్యాఖ్యలు చేసి ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. మొత్తానికి రేణూ దేశాయ్ చేసిన వ్యాఖ్యలు మాత్రం కొంత జనసైనికులకి సంతోషాన్ని అందిస్తున్నాయి.