Allu Aravind: 2011లో చిరంజీవి బ్లడ్ బ్యాంక్‌పై చేసిన రాజశేఖర్ -జీవితలు తప్పుడు ఆరోపణలు చేయగా, ఇటీవల కోర్టు వారిద్దరికి రెండేళ్ల జైలు శిక్ష మరియు రూ. 5,000 జరిమానా విధించిన విషయం తెలిసిందే. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో నాంపల్లి క్రిమినల్ కోర్టులోని 17వ చీఫ్ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టు ఈ ప్రకటన చేసింది. అయితే ఆర్డర్‌పై అప్పీల్ చేయడానికి సమయం ఇవ్వడానికి అదే కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా, చిరంజీవి తన బ్లడ్ బ్యాంక్‌లో దాతల నుంచి ఉచితంగా సేకరించిన రక్తాన్ని యూనిట్ రూ.850 చొప్పున విక్రయించారని వారు తప్పుడు ఆరోపణలు చేశారు.
బ్లడ్ బ్యాంక్ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం నుంచి రూ.14.5 లక్షలను పొందిన చిరంజీవి ఛారిటబుల్ ట్రస్ట్ర్ ఎన్నో అవకతవకలు చేసిందని వారు ఆరోపించడంతో… చిరంజీవికి బావమరిది అయిన అల్లు అరవింద్ వారిపై ఆధారాలతో పరువు నష్టం వేసారు. ఇప్పుడు ఇదే విషయంపై ఆయన భోళా శంకర్ ప్రీ రిలీజ్ వేడుకలో మాట్లాడారు. ఆగస్ట్ 10న విడుదల కానున్న భోళా శంకర్ మూవీ గత రాత్రి శిల్పకళా వేదికలో ప్రీ రిలీజ్ వేడుక నిర్వహించుకుంది. ఈ కార్యక్రమానికి మెహర్ రమేశ్, కీర్తి సురేష్, మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్, యంగ్ డైరెక్టర్స్ బాబీ, సంపత్ నంది, గోపీచంద్ మాలినేని, బుచ్చిబాబు, వంశీ పైడిపల్లి, హైపర్ ఆది, శ్రీముఖి తదితరులు హాజరయ్యారు.
ఈవెంట్‌లో ఈ సందర్భంగా అల్లు అరవింద్ మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. భోళా శంకర్ మంచి విజయం సాధిస్తుంది. అయితే చిరంజీవి చూడని సక్సెస్ ఏది. ఆయన సినిమాలు చూస్తూ మీరంతా పెరిగితే, ఆయనతో సినిమాలు చేస్తూ పెరిగాను. చిరంజీవిపై నాకున్న అభిమానం ఎలాంటిందంటే ..చిరంజీవి గారు చేసే సేవల్ని కొందరు తప్పుగా మాట్లాడరని తెలిసి.. 12 ఏళ్లు పోరాడి మరీ వారిని జైలుకి పంపించేంత వరకు వదలలేదని అన్నారు. ఆయనపై నాకు అంతటి అభిమానం ఉందని గుర్తుచేశారు. భోళా శంకర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రాజశేఖర్-జీవితల ఇష్యూలపై అల్లు అరవింద్ ఇలా ఓపెన్‌గా మాట్లాడడం ఇండస్ట్రీలో చర్చనీయాంశంగా మారింది.