స్టీరియో టైప్ లు ఏ ఇండస్ట్రీలోనైనా ఉండేవే. ఇందుకు హాలీవుడ్ లాంటి మేటి ఇండస్ట్రీలు కూడా ప్రత్యేకం కాదు. ఇక ఇండియా విషయానికి వస్తే బాలీవుడ్, కోలీవుడ్, మాలీవుడ్ ఇంకా టాలీవుడ్ అన్ని సినీ పరిశ్రమల్లోనూ స్టీరియో టైప్ లు ఉంటాయి. ఐతే, వాటిని మనం చాలా గ్రాంటెడ్ గా తీసుకుంటూ ఉంటాం. అది ఎంతవరకు కరెక్ట్ అనేది చాలా వరకు ఆలోచించం. అయితే.. మనం అంశాలకు సంబంధించిన విషయం గురించి మాట్లాడటం లేదు. కానీ, నటుల గురించి మాట్లాడుతున్నాం. ముఖ్యంగా కొందరు నటుల కొంతకాలం వరకు మనకు ఒకలా కనిపిస్తే వాళ్ళని ఎప్పుడూ అలానే చూడాలి అనుకుంటాం. వాళ్ళని తిరిగి మరోలా చూడటానికి పెద్దగా ఇష్టపడం. అయినా దాన్ని బ్రేక్ చేసిన వాళ్ళ కొందరి గురించి మాట్లాడుకుందాం.
ఉదాహరణకి, ఒక వ్యక్తి మనకు చాలా ఏళ్ల పాటు విలన్ గానో లేదా జోకర్ గానో కనిపించాడు అనుకుందాం. ఇక ఆ వ్యక్తిని ఎప్పుడూ అలానే చూడాలి అనుకుంటాం. సహజంగా వాళ్ళ కనిపించిన పాత్రలకి అప్పటి దాకా ట్యూన్ అయిపోయి ఉంటాం కాబట్టి మళ్ళీ వాళ్ళని ఇంకోలా చూడాలి అంటే కాస్త కష్టంగా అనిపిస్తుంది. అందుకే ఆ తరహా వ్యక్తులంతా కూడా మనకు తరువాతి కాలంలో చాలా భిన్నంగా చూడటానికి కష్టంగా అనిపిస్తారు. కానీ, తమ కష్టంతో నటులుగా తమ స్థితిని చాలావరకు మార్చకున్న కొందరి గురించి తెలుసుకుందాం.
సినిమా అనేది మెల్లగా ఫోన్ తెరకు లేదా లాప్ టాప్ తెరకు అంకితం అయిపోతుంది అని చెప్పుకోవచ్చు. ఫలితంగా ఓటీటీలకి క్రేజ్ పెరిగిన విషయాన్ని కూడా మనం అర్థం చేసుకోవచ్చు. అందుకే కొంతమంది నటులు ఈ అవకాశాన్ని వాడుకుని తమలోని డిఫరెంట్ కోణాన్ని చూపించే ప్రయత్నం చేస్తున్నారు. ప్రియదర్శినే తీసుకుందాం. ముందుగా మనకి ఒక కమెడియన్ గా కనిపించాడు. తర్వాత మెల్లగా హీరోగా చిన్న చిన్న సినిమాలు చేస్తూ.. అందరితో చప్పట్లు కూడా కొట్టించుకున్నాడు. తర్వాత మనం చెప్పుకోవాల్సిన వ్యక్తి సునీల్ గారు. ఆయన కూడా ఒకప్పుడు కేవలం కమెడియన్ లాగా మాత్రమే చూడబడ్డాడు. కానీ తర్వాత మెల్లగా హీరోగా ఎదిగిపోయాడు. గోపీచంద్ కూడా ఈ కోవలోకే వస్తారు. ఆయన ఒకప్పుడు పెద్ద విలన్. ఇప్పుడు హీరో. ఇలా టాలీవుడ్ లోనూ స్టీరియోటైప్ లని బ్రేక్ చేసే వ్యవస్థ కొనసాగింది.
Leave a comment