ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కో సినిమా పూర్తి కావాలి అంటే కొన్ని నెలల పాటు కలిసి పనిచేయాల్సి ఉంటుంది. పైగా గ్లామర్ ఫీల్డ్ కాబట్టి ఎప్పుడు ఎవరి మధ్య ఐనా ప్రేమలు పుట్టవచ్చు. ఇప్పటిదాకా హీరోలు కొంతమంది తమతో పాటు నటించిన హీరోయిన్లని లేదా క్యారెక్టర్ ఆర్టిస్ట్ లని పెళ్లి చేసుకున్నారు. కొంతమంది హీరోయిన్స్ నిర్మాతలని కూడా పెళ్లి చేసుకున్నారు. ఇందుకు డైరెక్టర్స్ కూడా ప్రత్యేకం కాదు. అవును. కొంతమంది హీరోయిన్స్ ఇలా తాము కలిసి పనిచేసిన దర్శకులని కూడా పెళ్లి చేసుకున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళ స్టోరీ ఏంటో చూద్దాం.
- రమ్యకృష్ణ – కృష్ణవంశీ
టాలీవుడ్ డైరెక్టర్ కృష్ణవంశీ రమ్యకృష్ణని ఏడేళ్ళ పాటు ప్రేమించి తర్వాత పెళ్లి చేసుకున్నారు. వీళ్ళ పెళ్లి 2003లో జరిగింది. వీళ్ళకి ఒక బాబు కూడా ఉన్నాడు.
- ప్రీత విజయ్ కుమార్ – హరి
మంజుల, విజయ్ కుమార్ ల కూతురు ప్రీత ఒకప్పుడు తెలుగు సినిమాల్లో నటించింది. చూడటానికి ఈమె అచ్చు తన చెల్లి జూనియర్ శ్రీదేవి లాగే ఉంటుంది. తరుణ్ నటించిన ‘ప్రియమైన నీకు’ సినిమాలో రెండో హీరోయిన్ గా నటించింది. ప్రధానంగా తమిళ్ లో సినిమాలు చేసిన ప్రీత తమిళ డైరెక్టర్ హరి ని పెళ్లి చేసుకుంది.
- దేవయాని – రాజ్ కుమార్
దేవయాని డైరెక్టర్ రాజ్ కుమార్ ని ప్రేమించింది. వాళ్ళింట్లో ఒప్పుకోకపోవడంతో ఆమె ఆయన్ని రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు మీడియాకి అందిన సమాచారం. 2001 లో ఆమె పెళ్లి జరిగింది.
- రోజా – సెల్వమణి
తెలుగు నటి రోజా గారు సెల్వమణి ఒక అసిస్టెంట్ డైరెక్టర్ గా ఉన్నప్పుడే ఆయన్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. 2002 లో వీళ్ళ పెళ్లి జరిగింది.
- కుష్బూ – సుందర్
మరో ఫేమస్ నటి కుష్బూ సుందర్ అనే తమిళ దర్శకుణ్ణి పెళ్లి చేసుకున్నారు. అలా ఆమె పేరు కుష్బూ సుందర్ అయిపోయింది. వీళ్ళ పెళ్లి 2000 వ సంవత్సరంలో జరిగింది.
- శరణ్య – పొన్ననన్
రఘువరన్ బీటెక్ సినిమాలో తల్లిగా నటించిన శరణ్య కూడా ఒక డైరెక్టర్ నే పెళ్లి చేసుకున్నారు.
- నయనతార – విగ్నేష్ శివన్
వీళ్ళు ఇంకా పెళ్లి చేసుకోలేదు. కానీ, వీళ్ళ పెళ్లి దాదాపు ఖరారైంది. ఇప్పటికే ఇద్దరు ప్రముఖులతో రిలేషన్ లో ఉన్న నయనతార దర్శకుడైన విగ్నేష్ ని ప్రేమిస్తుంది.
- సుహాసిని – మణిరత్నం
పాపులర్ నటి సుహాసిని మరో పాపులర్ డైరెక్టర్ మణిరత్నంని చేసుకున్నారు. 1988 లో వీళ్ళ పెళ్లి జరుగుతుంది.
వీళ్ళే కాకుండా అప్పట్లో ఒక పెద్ద డైరెక్టర్ అయిన బాలు మహేంద్ర శోభ అనే హీరోయిన్ ని పెళ్లి చేసుకున్నారు. కానీ ఆమె తర్వాత సూసైడ్ చేసుకుని చనిపోయారు.
Leave a comment