Anchor to Heroine: సినిమా అంటే చాలామంది వారి జీవితంలా భావిస్తారు. అలాంటి వారు సినిమాల్లోకి రావడానికి వారి శాయశక్తుల ప్రయత్నిస్తారు. తమకు వచ్చిన అవకాశాలతో ముందుకు వెళ్తూ కెరీర్ లో తమ టాలెంట్ ను చూపిస్తూ.. ప్రేక్షకుల్ని మెప్పిస్తారు. అలాగే తమ కలల్ని నెరవేర్చుకునేలా ప్రయత్నాలు మాత్రం ఆపరు. మీకు తెలుసా.. మనకు తెలిసిన చాలామంది స్టార్స్ ముందుగా బుల్లితెరపై రాణించి ఆ తర్వాత బ్రేక్ వచ్చి సినిమాల్లోకి వచ్చి రాణించారని. మరి బుల్లితెరపై కనిపించి, ప్రేక్షకుల్ని మెప్పించి సినిమాల్లో స్టార్స్ అయిన వారెవరో ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ అయితే నిహారిక.. మెగా డాటర్ గా తనకంటూ బ్యాక్ గ్రౌండ్ ఉన్నా.. సినిమాలంటే ప్రత్యేకమైన అభిమానంతో బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు.
తన కెరీర్ ను మొదటగా ఓ డాన్స్ రియాలిటీ షోకు యాంకరింగ్ చేశారు. తన టాలెంట్ తో ప్రేక్షకుల్ని ఇంప్రెస్ చేసిన నిహారిక.. నాగశౌర్య హీరోగా వచ్చిన ఒక మనసు సినిమాలో హీరోయిన్ గా యాక్ట్ చేసింది. ప్రజంట్ సినిమాలు, వెబ్ సిరీస్ లో యాక్ట్ చేస్తూ ప్రొడ్యూసర్ గా కూడా రాణిస్తుంది. నెక్ట్స్ కలర్స్ స్వాతి. స్వాతి కలర్స్ అనే ఛానెల్ లో ఓ ప్రోగ్రాంకు యాంకర్ గా వర్క్ చేశారు. యాంకర్ గా ఇండస్ట్రీలోకి వచ్చి ఎన్నో సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా వర్క్ చేసింది. సింగర్ గా కూడా తన టాలెంట్ ప్రజంట్ చేసింది. నాని హీరోగా యాక్ట్ చేసిన అష్టాచెమ్మా అనే మూవీతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చి వరుస అవకాశాలు దక్కించుకుంది. స్వామిరాారా, కార్తికేయ లాంటి సినిమాలతో బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంది.
నెక్ట్స్ రెజీనా.. ఆమె కూడా కెరీర్ స్టార్టింగ్ లో ఓ టీవీ షోలో యాంకర్ గా వర్క్ చేశారు. అలా ఆమె కందనాల్ ముదల్ అనే మూవీతో ఫిల్మ్ ఇండస్ట్రీకి వచ్చింది. శివ మనసులో శృతి అనే మూవీతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చింది. శ్రీముఖి.. యాంకర్ గా కెరీర్ లో తనకంటూ ఓ ఇమేజ్ ను క్రియేట్ చేసుకున్న శ్రీముఖి చంద్రిక అనే మూవీతో హీరోయిన్ గా మారింది. ప్రజంట్ యాంకరింగ్ తోనూ, సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గానూ దూసుకుపోతుంది. లేడీ సూపర్ స్టార్ గా ప్రజంట్ సౌత్ సినీ ఇండస్ట్రీని ఏలుతున్న బ్యూటీ నయనతార కూడా ఓ తమిళ్ ఛానల్ లో యాంకర్ గా వర్క్ చేసారు. ఇక రష్మీ.. ఈమెకు హీరోయిన్ గా అవ్వాలనే కలతో ఇండస్ట్రీకి వచ్చి ఓ పక్క సినిమాల్లో యాక్ట్ చేస్తూనే మరోపక్క బుల్లితెరపై కూడా తన యాంకరింగ్ తో అద్భుతంగా కెరీర్ ను లీడ్ చేస్తుంది.