Twins Always: ఎంత పెద్ద స్టార్ హీరోయిన్ సరే ఎప్పుడో అప్పుడు పెళ్లి చేసుకొని పిల్లలని కనాల్సిందే. చాలా తక్కువ మంది పెళ్లి చేసుకోకుండా ఉంటున్నారు. మీకు మంచు విష్ణు హీరోయిన్ సెలీనా జైట్లీ తెలిసే ఉంటుంది. అనేక బాలీవుడ్ చిత్రాలలో నటించిన ఈ అమ్మడు మంచు విష్ణు కెరీర్ ఆరంభంలో నటించిన సూర్యం చిత్రంలో కథానాయికగా నటించింది. అయితే ఈ సినిమా ఫ్లాప్ కావడంతో సెలీనాకి పెద్దగా అవకాశాలు రాలేదు. బాలవుడ్లో కూడా పెద్దగా అవకాశాలు తలుపు తట్టలేదు. దీంతో 2011లో సెలీనా జైట్లీ.. పీటర్ హాగ్ అనే బిజినెస్ మ్యాన్ ని వివాహం చేసుకుని విదేశాలలో సెటిల్ అయింది. అప్పుడప్పుడు మాత్రం సోషల్ మీడియా ద్వారా తన ఫ్యాన్స్‌ని పలకరిస్తూ ఉంటుంది.
తాజాగా ఫ్యాన్స్‌తో చాట్ సెషన్ నిర్వహించిన ఈ భామ తన శరీరంలో ఉన్న అరుదైన లోపం గురించి బయట పెట్టి అందరికి షాక్ ఇచ్చింది. కాగా సెలీనా పీటర్ దంపతులకు 2012లో కవల పిల్లలు జన్మించగా, 2017లో కూడా మళ్లీ సెలీనా గర్భవతి కావడం, అప్పుడు కూడా ఆమెకి కవల పిల్లలే జన్మించడం జరిగింది. ఇలా రెండు సార్లు కవలపిల్లలు జన్మించడం చాలా అరుదు కాబట్టి ఓ నెటిజన్ మీకు సహజంగానే కవలపిల్లలు పుట్టారా లేక ఏదైనా చికిత్స చేయించుకోవడం వల్ల ఇలా జరిగిందా అని ఆమెని ప్రశ్నించారు. దీనికి ఆమె బదులిస్తూ తన బాడీలో ఉన్న లోపం గురించి చెప్పుకొచ్చింది. నాకున్న జన్యు సమస్య వల్ల ఓవిలేషన్ సమయంలో మల్టిపుల్ ఎగ్స్ రిలీజ్ అవుతుంటాయి. ఆ కారణం వల్లనే నేను గర్భవతిని అయిన ప్రతి సారి నాకు కవలలే జన్మిస్తారు అని చెప్పుకొచ్చింది.
నా కేస్ లో నాకు నాన్ ఐడెంటికల్ ట్విన్స్ జన్మిస్తారు అని సెలీనా తన జన్యు లోపం గురించి వివరించి అందరిని ఆశ్చర్యపరిచింది సెలినా. ఆమె కామెంట్‌పై కొందరు ఇది లోపం కాదు.. దేవుడు మీకిచ్చిన గొప్ప వరం అని చెప్పుకొస్తున్నారు.. అయితే తన పిల్లల విషయంలో సెలీనా, పీటర్ దంపతులకి గుండె కోత మిగిలింది . రెండవసారి జన్మించిన కవలలు హార్ట్ సంబంధిత సమస్యలతో పుట్టగా, ఇందులో ఒక పిల్లాడు కొన్ని రోజులకే మరణించాడు. రెండవ పిల్లాడు క్రమంగా కోలుకుని ఆరోగ్యంగా ఆన్నాడు.. ఇప్పుడు సెలీనా తన ముగ్గురు పిల్లలు, భర్తతో హ్యపీగా ఉంటుంది.