Bimbisara – Karthikeya 2: పరుగులు పెడుతున్న కాలంతో పాటు.. డెవలప్ అవుతున్న టెక్నాలజీని అందిపుచ్చుకుంటూ తెలుగు సినిమా ప్రపంచవ్యాప్తంగా సత్తా చాటుతుంది. ‘ఈగ’, ‘బాహుబలి’ లాంటి విజువల్ వండర్స్‌తో టాలీవుడ్ ఇండస్ట్రీ హాలీవుడ్ రేంజ్ మేకింగ్ చెయ్యగలదని నిరూపించారు రాజమౌళి.
‘ఆర్ఆర్ఆర్’ తో మరోసారి తెలుగు సినిమా స్టామినా ఏంటనేది చూపించారు. కథ పరంగా టెక్నికల్ అంశాలకు పెద్ద పీట వేస్తున్నారు మేకర్స్. సీజీ, వీఎఫ్ఎక్స్ రూపంలో ఆడియన్స్‌ని బిగ్ స్క్రీన్ మీద థ్రిల్‌కి గురిచెయ్యడానికి అహర్నిశలూ శ్రమిస్తున్నారు.
భారీ స్థాయి వీఎఫెఎక్స్ షాట్స్ కలిగిన రెండు భారీ సినిమాలు.. ఈ ఆగస్టులో రెండు వారాల గ్యాప్‌లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ఆగస్టు 5న ‘బింబిసార’, ఆగస్టు 12న ‘కార్తికేయ 2’ రిలీజ్‌కి రెడీ అవుతున్నాయి.
కళ్యాణ్ రామ్ హోమ్ బ్యానర్లో వశిష్టను దర్శకుడిగా ఇంట్రడ్యూస్ చేస్తూ.. టైమ్ ట్రావెల్ బ్యాక్ డ్రాప్లో చేసిన మూవీ ‘బింబిసార’.. కళ్యాణ్ రామ్ కెరీర్లో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిందీ చిత్రం.. ప్రోమోస్, సాంగ్స్ ప్రామిసింగ్‌గా ఉండడమే కాక సినిమా మీద అంచనాలు పెంచేశాయి. గతేడాది సెప్టెంబర్‌లోనే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ‘బింబిసార’ సీజీ, వీఎఫ్ఎక్స్ వర్క్ కోసం చాలా టైం తీసుకుంది. ఈ సినిమాలో దగ్గర దగ్గర 4 వేల వరకు వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయట.
యంగ్ హీరో నిఖిల్ కెరీర్లో ‘కార్తికేయ’ సినిమా గుర్తుండిపోయే సినిమా అని చెప్పొచ్చు. దర్శకుడు చందు మొండేటి ఫస్ట్ ఫిలింతోనే ఆడియన్స్‌ని ఆకట్టుకున్నాడు. ఇన్నేళ్ల తర్వాత ఈ సినిమాకి సీక్వెల్ వస్తోంది. భారీ అంచనాలతో ‘కార్తికేయ 2’ ఆగస్టు 12న రిలీజ్ అవుతోంది. ఈ మూవీలో 3 వేల వీఎఫ్ఎక్స్ షాట్స్ ఉన్నాయట. మొత్తానికి ఈ ఆగస్టులో రెండు వారాల గ్యాప్‌లో ఈ రెండు సినిమాలు సరికొత్త అనుభూతినివ్వనున్నాయి.
Leave a comment