Umair’s Tweet: ఇటీవల సెలబ్రిటీలందరిని టార్గెట్ చేస్తూ తప్పుడు వ్యాఖ్యలు చేస్తున్న ఉమైర్ సంధు కొన్నాళ్లుగా వార్తలలో నిలుస్తున్నారు. దుబాయి సెన్సార్ బోర్డ్ మెంబర్ అని చెప్పుకుంటూ రిలీజ్‌కి కొద్ది రోజులు ముందే రివ్యూలు చెప్పే అతనికి సోషల్ మీడియాలో చాలా మంంది శత్రువులు ఉన్నారు. ఇక ఇటీవల మనోడు రూట్ మార్చాడు. హీరో లేదా హీరోయిన్ గురించి తప్పుడు కామెంట్స్ చేయడం, అదీ కాదంటే వారి పర్సనల్ విషయాల గురించి లేనిపోనివన్నీ క్రియేట్ చేసి వివాదాలు సృష్టించి హాట్ టాపిక్ అవుతున్నాడు. ఇటీవల ఆయన పూజా హెగ్డే గురించి తప్పుడు కామెంట్స్ చేసి అందరిని టెన్షన్ పెట్టాడు. పూజా ఆత్మహత్యాయత్నానికి పాల్పడిందని , సరైన సమయంలో ఆమె కుటుంబ సభ్యులు గుర్తించడంతో కాపాడాకలిగారని ఉమైర్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
ఉమైర్ చేసిన పనికి పూజా హెగ్డే అభిమానులే కాక సినీ ప్రియులు కూడా ఆగ్రహం వ్యక్తం చేశారు. పూజా హెగ్డేపై ఉమైర్ అంత చీప్ కామెంట్స్ చేసే సరికి పూజా హెగ్డే టీమ్ అతనికి లీగల్ నోటీసులు పంపింది. అయితే వాటిని ఆయన ప్రౌడ్‌గా ఫీలవుతూ.. గర్వంగా తన ట్విట్టర్ లో పెట్టుకుని సంతోషపడుతున్నాడు. ఈయన ధోరణి చూస్తుంటే తనను ఎవరూ ఏమీ చేయలేరు అన్నట్లు ఉంది. ప్రస్తుతం వేరే దేశంలో ఉండి ఇలా తప్పుడు ట్వీట్స్ చేస్తూ ..లీగల్ గా దొరకనని చెప్తున్నట్లుగా ఉంది అతని వైఖరి.ఈయన పూజ హెగ్డేనే కాదు చాలా మంది సెలబ్రిటీలపై కూడా ఇలాంటి తప్పుడు ఆరోపణలు చేశారు.
గతంలో ఊర్వశి రౌతేలా ను అఖిల్ హెరాస్ చేశాడని సోషల్ మీడియాలో సంచలన ట్వీట్ చేసాడు. ఏజెంట్ సినిమా ఐటెం సాంగ్ షూట్ జరుగుతున్న సమయంలో అఖిల్.. ఊర్వశిని ఏడిపించాడని, ఆమెతో మిస్ బిహేవ్ చేశాడని, ఊర్వశికి కూడా అతనితో వర్క్ చేయడం నచ్చక ఆ విషయాన్ని బయట చెప్పిందని ఉమైర్ స్పష్టం చేశాడు. మహేష్ బాబు, పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్ ఇలా చాలా మంది సెలబ్రిటీల గురించి ఉమైర్ తప్పుడు కామెంట్స్ చేయడం ఇటీవల కాలంలో పరిపాటిగా మారింది. మరి లీగల్ నోటీసులని కూడా ఆయన లైట్‌గా తీసుకుంటుంటే మరి ఆయన ఆగడాలకి ఎలా అడ్డుకట్ట పడుతుందో చూడాల్సి ఉంది.