Umm.. Sreeleela has grown so much.. Did she say no to Allu Arjun's film..!
Home Film News SreeLeela-Allu Arjun: అమ్మో.. శ్రీలీలకి ఎంత పెరిగిపోయింది.. అల్లు అర్జున్ సినిమాకే నో చెప్పేసిందా..!
Film News

SreeLeela-Allu Arjun: అమ్మో.. శ్రీలీలకి ఎంత పెరిగిపోయింది.. అల్లు అర్జున్ సినిమాకే నో చెప్పేసిందా..!

SreeLeela-Allu Arjun: ఇప్పుడు టాలీవుడ్ లో ఎవ‌రి నోట విన్నా కూడా శ్రీలీల పేరు వినిపిస్తుంది. ద‌ర్శ‌క నిర్మాత‌లు అయితే శ్రీలీల జ‌పం చేస్తున్నారు. పెళ్లిసందD సినిమాతో టాలీవుడ్ లోకి మెరుపులా దూసుకువచ్చిన ఈ అమ్మడు ప్ర‌స్తుతం జెట్ స్పీడ్‌తో దూసుకుపోతుంది.కుర్ర హీరోలు, స్టార్ హీరోల సినిమాలు చేస్తూ టాప్ హీరోయిన్‌గా ఎదిగేందుకు ప్ర‌య‌త్నిస్తుంది. ర‌వితేజ ధ‌మాకా చిత్రంలో క‌థానాయిక‌గా న‌టించి మంచి హిట్ అందుకున్న త‌ర్వాత శ్రీలీల జోరుకి అడ్డు లేకుండా పోయింది. స్టార్ హీరోలు  ప‌వన్ కల్యాణ్, మహేష్ బాబు, రామ్ పోతినేని, బాలకృష్ణ లాంటి స్టార్ హీరోల చిత్రాల్లో అవకాశాలు అందుకుంది. ఈ అమ్మ‌డికి డ్యాన్స్, యాక్టింగ్, అందం… ఇలా అన్ని ఉండ‌డంతో ఆమెకి తిరుగులేకుండా పోతోంది.

ప్ర‌స్తుతం  టాలీవుడ్ లో ఉన్న బెస్ట్ ఫిమేల్ డ్యాన్సర్లలో శ్రీలీల ఒకరు అంటే అతిశ‌యోక్తి కాదు.ఒక‌ప్పుడు స్టార్ హీరోల సినిమాలంటే రష్మిక, పూజా హెగ్డే లాంటి ముద్దుగుమ్మలే బెస్ట్ ఆప్ష‌న్స్ గా ఉండేవారు. కాని   సునామీలా దూసుకువచ్చిన శ్రీలీల వారి స్థానాలకు ఎసరు పెట్టేసింది అని చెప్పాలి. ఈ అమ్మ‌డిని ప‌లు ప్రీ రిలీజ్ ఈవెంట్‌ల‌కి గెస్ట్‌గా కూడా పిలుస్తున్నారంటే శ్రీలీల క్రేజ్ ఏ రేంజ్‌లో పెరిగిందో అర్ధం చేసుకోవ‌చ్చు. అయితే శ్రీలీల ప్ర‌స్తుతం చేతి నిండా సినిమాల‌తో బిజీగా ఉండ‌గా, పుష్ప‌2 ఆఫ‌ర్ కూడా ఆమెని వ‌రించింద‌ట‌. కాని ఆమె దానికి సున్నితంగా నో చెప్పింద‌ని అంటున్నారు.

పుష్ప‌లో స‌మంత ఐటెం సాంగ్ చేయ‌గా,  పుష్ప-2 సినిమాలో ఐటెం సాంగ్‌ కోసం  శ్రీలీలని మేక‌ర్స్ సంప్ర‌దించారు. అయితే ఆమె సున్నితంగా వద్దని చెప్పేసిందట. ఇప్పుడిప్పుడే త‌న‌ కెరీర్‌ పీక్స్‌ స్టేజీకి వెళుతుంది. ఈ సమ‌యంలో ఐటెం పాట చేయడం రిస్క్‌ అని భావించిన ఈ బ్యూటీ నో చెప్పింద‌ట . ఐటెం సాంగ్‌ అంటే పూర్తి గ్లామర్‌ ఒలకబోయాల్సి ఉంటుంది కాబ‌ట్టి,  అది తన వల్ల కాదని నో చెప్పిన‌ట్టు ఫిలింన‌గ‌ర్‌లో జోరుగా ప్ర‌చారం సాగుతుంది. ఇందులో నిజ‌మెంత ఉందో తెలియాల్సి ఉంది. ఆ మ‌ధ్య త్రివిక్రమ్ డైరెక్షన్‌లో బన్నీ, శ్రీలీల కలిసి ఓ యాడ్ చేయగా, ఈ  యాడ్ చూసిన వాళ్లకు వీళ్లద్ద‌రి పేయిర్ చాలా ఫ్రెష్‌గా అనిపించింది

Related Articles

చిరంజీవికి విలన్‌గా అమితాబ్ అల్లుడు.. అసలు ట్విస్ట్ అదిరిపోయిందిగా..!

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లోనే అత్యంత భారీ బడ్జెట్ తో యువి క్రియేషన్స్ రూపొందిస్తున్న విశ్వంభర...

బాలయ్య 109వ సినిమాకు… బోయపాటికి లింక్.. ఆ సెంటిమెంట్ వర్కౌట్ అయితే సినిమా బంపర్ హిట్..!

తెలుగు చిత్ర పరిశ్రమలోని అందరు హీరోలూ భారీ ప్రాజెక్టులను చేస్తూ దూసుకుపోతోన్నారు. అందులో కొందరు మాత్రమే...

రామ్ చరణ్ – అల్లు అర్జున్ మల్టీస్టారర్​కు టైటిల్ ఫిక్స్.. సినిమాను అనౌన్స్ చేసిన అల్లు అరవింద్..!

మన తెలుగు చిత్ర పరిశ్రమలు ఎన్నో మల్టీ స్టార్లర్ సినిమాలు వచ్చాయి.. కొన్ని సినిమాలు అయితే...

ప్రభాస్ vs అల్లు అర్జున్… రక్తం వచ్చేలా కొట్టుకున్న అభిమానులు.. వీడియో వైరల్..!

అభిమానుల మధ్య వాగ్యుద్ధాలు తెలుగు వాళ్ళకి కొత్తేమీ కాదు. పాత తరం నటుల నుంచి నేటి...