Satyadev: ఎవరి సపోర్ట్ లేకుండా సినిమా స్టార్ అవ్వాలంటే ఎంత కష్టం.. మనలో విషయం ఉంటే.. ఎలాంటి ఆటుపోట్లనైనా ఎదుర్కొని నిలబడితే విజయం మన వైపు ఉంటుంది అని మెగాస్టార్ చిరంజీవి, మాస్ మహారాజా రవితేజ, విజయ్ దేవరకొండ లాంటి స్టార్స్ జీవితాలు చూస్తే అర్థమవుతుంది.
ఆ కోవలేకో వస్తాడు సత్యదేవ్.. ఎలాంటి ఫిల్మీ బ్యౌగ్రౌండ్ లేకపోయినా.. యాక్టింగ్ మీద ఉన్న ప్యాషన్‌తో, యాక్టర్ అవ్వాలని డిసైడ్ అయ్యి ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చాడు. ‘మిస్టర్ పర్ఫెక్ట్’, ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లెచెట్టు’, ‘అత్తారింటికి దారేది’ ‘ముకుంద’, ‘అసుర’ లాంటి సినిమాల్లో స్మాల్ క్యారెక్టర్స్ చేసాడు. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ ‘జ్యోతిలక్ష్మీ’ మూవీతో గుర్తింపు వచ్చింది.
‘క్షణం’, ‘అప్పట్లో ఒకడుండేవాడు’, ‘ఘాజీ’, ‘బ్లఫ్ మాస్టర్’ లాంటి సినిమాలతో సత్యదేవ్‌లో మంచి నటుడున్నాడనిపించుకున్నాడు. ఇప్పుడు ‘కృష్ణమ్మ’, ‘గుర్తుందా శీతాకాలం’ సినిమాల్లో హీరోగా చేస్తున్నాడు. మెగాస్టార్ చిరంజీవి పక్కన ‘ఆచార్య’ తర్వాత ‘గాడ్ ఫాదర్’ లోనూ నటిస్తున్నాడు. అయితే ఇక్కడి వరకు రావడానికి సత్యదేవ్ చాలా కష్టపడ్డాడు.
ఉదయం ఆరు గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు సినిమా ఆఫీసులకి వెళ్లి ఆడిషన్స్ ఇచ్చేవాడు. సాయంత్రం ఆరు తర్వాత ఐఎంబీలో జాబ్ చేసేవాడు. అప్పుడతని శాలరీ నెలకి అక్షరాలా లక్షా యాభైవేలు.. టాలెంట్‌కి లక్ తోడైతే అనుకున్నది సాధించడం ఏమంత కష్టం కాదని ప్రూవ్ చేసి.. ఎంతోమంది అప్‌కమింగ్ ఆర్టిస్టులకి ఇన్స్పిరేషన్‌గా నిలిచాడు సత్యదేవ్.
Leave a comment