శ్రియ శరణ్ ఇప్పుడు ఎంత పెద్ద నటిగా మారిందో మనందరికీ తెలుసు. కానీ, తన కెరీర్ ఒక చిన్న సినిమాతోనే మొదలైంది. అది కూడా ఒక తెలుగు సినిమా. తనకు ఒక్కదానికి మాత్రమే కాదు.. ఆమెతో పాటు నటించిన ఆ హీరోకి, దర్శకుడికి కూడా ఇదే మొదటి సినిమా. ఆ డైరెక్టర్ కూడా ముందు రోజుల్లో పెద్ద డైరెక్టర్ గా మారి ఇష్క్, 24, మనం వంటి సినిమాలు చేశాడు. అలాగే, ‘హలో’ సినిమా ద్వారా అక్కినేని అఖిల్ కి డెబ్యూ మూవీ డైరెక్ట్ చేశాడు. కానీ ఆ హీరో మాత్రం తన కెరీర్ లో ఏ మాత్రం రాణించలేదు. అతనే చరణ్ రెడ్డి.
2001 లో వచ్చిన ఇష్టం సినిమా తర్వాత అక్కినేని కుటుంబానికి చెందిన అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ అమ్మాయి ఎవరో కాదు.. అక్కినేని సుమంత్ చెల్లి సుప్రియ. వాళ్ళిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడే పెళ్లి చేసుకున్నా వాళ్ళ మధ్య ముందు ముందు ఎన్నో సమస్యలు వచ్చినట్లు తెలుస్తోంది. చరణ్ మూవీస్ లో సక్సెస్ చూడకపోవడం, తను అల్లుడిగా వెళ్ళిన కుటుంబం చాలా పెద్దది కావడం వంటి విషయాల మధ్య చరణ్ బాగా ఒంటరి వాడు ఐపోయాడన్నది ఒక అంచనా.
చరణ్ నెల్లూరు జిల్లాకి చెందిన వాడు. సినిమాలోకి ఎలా వచ్చాడు అన్న విషయం మీద అంతగా స్పష్టత లేదు కానీ.. రామోజీ రావు నిర్మించిన ఆ ఇష్టం సినిమాకి హీరోగా నటించాడు. సినిమాకి కొంతవరకు గుర్తింపు వచ్చింది. కానీ, ఆ మూవీ కమర్షియల్ గా హిట్ అవలేదు. ఇక అప్పటినుంచి చరణ్ కి ఇండస్ట్రీలో ఎలాంటి అవకాశాలు రాలేదు. ఇక అతనికి ఎలాంటి సక్సెస్ లేకపోవడం వల్ల తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురై ఆల్కహాల్ కి బానిస అయ్యాడని, అది భరించలేకే అతని భార్య సుప్రియ చరణ్ తో విడాకులు తీసుకోవాలి అనుకుందట. ఇలాంటి కారణాలన్నీ అతన్ని మరింత ఒత్తిడిలోకి నెట్టేసి ఉండవచ్చు.. 2012 లో అతను హాస్పిటల్ పాలై గుండెపోటుతో చనిపోయారు. ఏది ఏమైనా మానసిక సమస్యలు మనుషులని చాలా దూరం తీసుకువెళతాయి.
Leave a comment